హిందూ మతంలో సోమవారం లయకారుడైన శివయ్యకు అంకితం చేయబడింది. మహాదేవునికి ఈ రోజు ప్రత్యేక పూజలు చేస్తారు. లింగ రూపంలో ఉన్న శివయ్యను నియమ నిష్టలతో ఆచారాలు పద్దతులతో పూజిస్తే చాలా సంతోషిస్తాడు. భక్తుల కోరిన ప్రతి కోరికను నెరవేరుస్తాడు. మహాదేవుడిని ఆరాదించే సమయంలో బిల్వ పత్రాన్ని ఖచ్చితంగా సమర్పిస్తారు. జలం, బిల్వపత్రాలను సమర్పించడం ద్వారా మహాదేవుడు చాలా త్వరగా సంతోషిస్తాడని చెబుతారు. బిల్వ పత్రం శివయ్య పూజకు అందుబాటులో లేక పొతే.. ఒకసారి సమర్పించిన బిల్వపత్రాన్ని కడిగి మళ్ళీ సమర్పించినా సంతృప్తి చెంది సంతోషించే భోళాశంకరుడు. అయితే త్రినేత్రుడికి పియ్రమైన బిల్వపత్రంలో అనేక ఔషధ గుణాలున్నాయి అన్న విషయం తెలుసా..! ఈ రోజు బిల్వ పత్రం విశిష్టత గురించి తెలుసుకుందాం..
బిల్వ పత్రం ఔషధ గుణాల నిధి అని నమ్ముతారు. మహా దేవుడు సముద్ర మదన సమయంలో ఉద్భవించిన విషం తాగి.. ఆ విష ప్రభావంతో శరీరంలో భరించలేని మంటలు.. నొప్పితో బాధపడుతున్నప్పుడు.. శివయ్య బాధను తగ్గించడానికి సకల దేవతలు అనేక వస్తువులను సమర్పించారట. అయితే అలా అలాంటి వస్తువుల్లో బిల్వ పత్రం ఒకటి. శివయ్యకు బిల్వ పత్రం సమర్పించిన తర్వాత విషయాన్నీ హరించే గుణం ఉన్న బిల్వ పత్రం వలన శివయ్య శరీరంలోని విష ప్రభావం తగ్గి మంటల నుంచి ఉపశమనం లభించింది. అప్పటి నుంచి బిల్వ పత్రం మహాదేవుడికి చాలా ప్రియమైనదిగా మారిందట. నాటి నుండి నేటి వరకు శివయ్య పూజలో బిల్వ పత్రం సమర్పిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు