Medaram Jatara 2022: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు. పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన భక్తురాలు

|

Feb 12, 2022 | 5:41 PM

Medaram Jatara 2022: తెలంగాణ (Telangana)కుంభమేళా(Kumbhamela).. ఆదివాసీ గిరిజన జాతర సంబురాలు మొదలయ్యాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) జాతరకు..

Medaram Jatara 2022: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు. పెంపుడు కుక్కకు నిలువెత్తు బంగారం సమర్పించిన భక్తురాలు
Medaram Jatara Bangaram Mokkulu
Follow us on

Medaram Jatara 2022: తెలంగాణ (Telangana)కుంభమేళా(Kumbhamela).. ఆదివాసీ గిరిజన జాతర సంబురాలు మొదలయ్యాయి. ప్రతి రెండేళ్లకు ఒకసారి వైభవంగా జరిగే సమ్మక్క సారలమ్మ(Sammakka Saralamma) జాతరకు తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. మేడారం జాతరలో వన దేవతలకు భక్తులు నిలువెత్తు బంగారం (బెల్లం) మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. ఇదే క్రమంలో మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ కు చెందిన మన్నెం రాములు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కకు మొక్కు చెల్లించుకున్నాడు‌. కుక్క నిలువెత్తు బంగారం.. అదే అమ్మవారికి సమర్పించే బెల్లాన్ని 20 కిలోలు అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లించుకుని తన భక్తిని చాటుకున్నాడు. పెంపుడు కుక్కను తమ కుటుంబంలో ఒక వ్యక్తిగా భావిస్తామని.. అందుకు తమ వారసుడిగా సమ్మక్క సారలమ్మలకు మొక్కు చెల్లించుకున్నామని తెలిపారు ఆ కుటుంబ సభ్యులు.

 

Also Read:

 సొంత ప్లేయర్లపైనే కన్నేసిన చెన్నై సూపర్ కింగ్స్‌.. పూర్తి జాబితా ఇదే..!

 6 ఏళ్ల బాలుడి ప్రాణం కోసం తాను క్యాన్సర్ తో పోరాడుతూ.. 61 లక్షల పోగు చేసి అనంతలోకాలకు

Bhishma Ekadashi: భీష్మ ఏకాదశి విశిష్టత.. ఈ పర్వదినం రోజున విష్ణు సహస్రనామాలు చదివితే కలిగే అద్భుత ఫలితం..