Medaram Jatara 2022: తెలంగాణ(Telangana)లోని మేడారం మహా జాతర ప్రాంతాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli), సత్యవతి రాథోడ్(Satyavathi Rathod), టీఎస్ఆర్టిసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. మహా జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 18వ తేదీన కుటుంబ సమేతంగా మేడారంకు వస్తారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో మేడారంలో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. గత జాతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఒక్క చిన్న లోటు కూడ లేకుండా చేయాలని సీఎం ఆదేశించారు. అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయించేందుకు కూడ సీఎం సిద్దంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.
సమ్మక్క సారలమ్మ జాతరకు చేసిన ఏర్పాట్లతో భక్తులు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. ఎక్కడా పారిశుధ్యం నిర్వహణలో ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టామని .. కోవిడ్ వ్యాప్తి చెందకుండా భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆదివాసీ సంఘాలు, పూజారులు ఐక్యతతో ఏ నిర్ణయం తీసుకున్నా వారి నిర్ణయం మేరకు జాతరను నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు మంత్రులు. అంతేకాదు ఈ సందర్భంగా రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మహా జాతర సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని కోరారు. 40 వేలమంది సిబ్బంది జాతర విధుల్లో పాల్గొంటారని తెలిపారు.
Also Read: