Matangeshwar Temple: సైన్స్ చేధించని మిస్టరీ ఈ శివలింగం.. ప్రతి ఏడాది కార్తీక పున్నమి రోజున పెరుగుతుంది..

|

Apr 27, 2024 | 2:29 PM

భారత దేశంలో మాత్రమే కాదు అనేక దేశాల్లో శివ లింగాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ  మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా. ఈ ఆలయంలో ఉన్న శివలింగం జీవం ఉన్న శివలింగంగా పరిగణించబడుతుంది.  ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ శివలింగం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే  ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని శరత్  పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని చెబుతారు.

Matangeshwar Temple: సైన్స్ చేధించని మిస్టరీ ఈ శివలింగం.. ప్రతి ఏడాది కార్తీక పున్నమి రోజున పెరుగుతుంది..
Matangeshwar Mahadev Temple
Follow us on

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయం మధ్యప్రదేశ్‌ లో ఉంది. ఈ రాష్ట్రంలో  పురాతన, మధ్యయుగ దేవాలయాలకు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు. దీనితో పాటు ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో రహస్యం దాగుతుంది. ఒక సంఘటన ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీనికి గల కారణాన్ని శాస్త్రవేత్తలు ఇప్పటికీ గుర్తించలేకపోయారు.

ప్రపంచంలో నివసించే శివలింగం

భారత దేశంలో మాత్రమే కాదు అనేక దేశాల్లో శివ లింగాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ
మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలోని మాతంగేశ్వర ఆలయ రహస్యం చాలా ప్రత్యేకమైనది. అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కూడా. ఈ ఆలయంలో ఉన్న శివలింగం జీవం ఉన్న శివలింగంగా పరిగణించబడుతుంది.  ఎందుకంటే ఈ శివలింగం ఎత్తు ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ శివలింగం ఎంత ఎత్తుకు ఎదిగిందంటే  ప్రస్తుతం ఈ శివలింగం పొడవు దాదాపు 9 అడుగులకు చేరుకుంది. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలోని శరత్  పూర్ణిమ రోజున దీని పొడవు పెరుగుతుందని చెబుతారు. అది కూడా శివలింగం నువ్వుల విత్తనం పరిమాణం అంత పెరుగుతుందట. ఈ విషయాన్నీ ధృవీకరించడానికి శివలింగం పొడవును పర్యాటక శాఖ ఉద్యోగులు కొలుస్తారు. ఇలా కొలిచిన ప్రతిసారీ శివలింగం పొడవు మునుపటి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు చెబుతారు.

ప్రసిద్ధ పురాణం ప్రకారం..

పౌరాణిక కథనం ప్రకారం ఈశ్వరుడి వచ్చ పచ్చల రత్నం ఉందట. దానిని శివుడు పాండవుల్లో అగ్రజుడు  యుధిష్ఠిరునికి ఇచ్చాడు. అనంతరంయుధిష్ఠిరుడి ఆ రత్నాన్ని మాతంగ మహర్షికి ఇచ్చాడు. మాతంగ మహర్షి ఆ పచ్చల రత్నాన్ని దానిని రాజు హర్షవర్మ కు ఇచ్చాడు. మాతంగ మహర్షికి మాతంగేశ్వర మహాదేవ అనే పేరుంది. ఎందుకంటే ఈ పచ్చల రత్నాన్ని భద్ర పరచడానికి 18 అడుగుల శివలింగం మధ్య భూమిలో పాతి పెట్టాడు. అప్పటి నుంచి నేటి వరకూ ఈ పచ్చల రత్నం శివలింగం క్రింద ఉందని చెబుతారు. ఈ రత్నం  అద్భుతమైన శక్తి కారణంగా.. ఈ శివలింగం ప్రతి సంవత్సరం జీవించిన మానవుని వలె పెరుగుతుంది. అందుకే దీనిని జీవమున్న శివలింగం అని కూడా పిలుస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు