Masa Shivaratri: ఈ నెల 7వ తేదీన మాస శివరాత్రి.. శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా..

|

Apr 04, 2024 | 8:08 AM

ఈ మాస శివరాత్రి రోజున అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరుకానున్నాయి. కనుకనే చిత్ర మాసం ముందు వస్తున్న మాస శివరాత్రిని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ మాస శివరాత్రిలో అనేక ప్రత్యేక యాదృచ్చికాలు జరుగుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం అనే అరుదైన కలయిక జరగనుంది. సర్వార్థ సిద్ధియోగంలో పరమశివుడిని, పార్వతిని ఆరాధించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, అన్ని కార్యాలలో విజయం చేకూరుతుందని విశ్వాసం.

Masa Shivaratri: ఈ నెల 7వ తేదీన మాస శివరాత్రి.. శివుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా..
Masa Shivaratri Puja
Follow us on

మాస శివరాత్రి అనేది మహాదేవుని జన్మ తిథి ని అనుసరించి ప్రతి నెల పర్వదినంగా చేసుకునేది. ఇది ప్రతి నెలలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశి తిథిని మాస శివరాత్రి అంటారు. ఈ సారి మాస శివరాత్రిని ఏప్రిల్ 7వ తేదీన జరుపుకోనున్నారు. మాస శివరాత్రి పండుగ శివ పార్వతికి అంకితం చేయబడింది. ఆది దంపతులైన శివ పార్వతుల ఆశీస్సులు పొందడానికి  భక్తులు ఈ రోజున పూర్తి నియమ నిష్టలతో భక్తితో పూజిస్తారు. ఉపవాసం చేస్తారు.

ఈ మాస శివరాత్రి రోజున అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరుకానున్నాయి. కనుకనే చిత్ర మాసం ముందు వస్తున్న మాస శివరాత్రిని ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఈ మాస శివరాత్రిలో అనేక ప్రత్యేక యాదృచ్చికాలు జరుగుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగం, బ్రహ్మయోగం, ఇంద్రయోగం అనే అరుదైన కలయిక జరగనుంది. సర్వార్థ సిద్ధియోగంలో పరమశివుడిని, పార్వతిని ఆరాధించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయని, అన్ని కార్యాలలో విజయం చేకూరుతుందని విశ్వాసం. ఈ మాస శివరాత్రి రోజున భద్ర , పంచకం కూడా ఉన్నాయి.

చైత్ర మాస శివరాత్రి శుభ సమయం

పంచాంగం ప్రకారం చతుర్దశి తిథి ఏప్రిల్ 7, 2024న ఉదయం 6:53 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఏప్రిల్ 8న తెల్లవారుజామున 3:21 గంటలకు ముగుస్తుంది. మాస శివరాత్రి సమయంలో రాత్రి సమయంలో శివుడిని పూజించే సంప్రదాయం ఉంది. అందుకే మాస శివరాత్రి పండుగను ఏప్రిల్ 7న జరుపుకోవాలని పండితులు సూచించారు.

ఇవి కూడా చదవండి

నిశిత ముహూర్తంలో పూజా సమయం

చాలా మంది భక్తులు శివరాత్రి నిశిత ముహూర్తంలో మాత్రమే పూజించడానికి ఇష్టపడతారు. పంచాంగం ప్రకారం నిశిత ముహూర్తంలో పూజా సమయం ఏప్రిల్ 7 అర్ధరాత్రి 12 నుంచి ప్రారంభమై 12:45 వరకు కొనసాగుతుంది. అందుకే ఈసారి మాస శివరాత్రి రోజున నిశిత ముహూర్తం మొత్తం 45 నిమిషాల సమయం  అందుబాటులో ఉంటుంది.

సర్వార్థ సిద్ధి యోగం, బ్రహ్మ యోగం, ఇంద్ర యోగ సమయం

మాస శివరాత్రి రోజున సర్వార్థ సిద్ధి యోగం ఏప్రిల్ 7వ తేదీ మధ్యాహ్నం 12:58 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 8వ తేదీ ఉదయం 6:03 గంటల వరకు కొనసాగుతుంది. ఇక ఉదయం నుంచి రాత్రి 10.17 గంటల వరకు బ్రహ్మయోగం ఉంటుంది. దీని తర్వాత ఇంద్రయోగం ప్రారంభమవుతుంది.

భద్ర , పంచక సమయం

ఈ మాస శివరాత్రికి భద్ర, పంచకం కూడా పడుతోంది. భద్ర 6:53 AM నుంచి 5:7 PM వరకు ఉంటుంది.  పంచకం రోజంతా ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు