హిందూ మతంలో ప్రతి నెల కృష్ణ పక్షంలోని చతుర్దశి తిధిన మాస శివరాత్రి పండుగగా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయువు, ఇంట్లో సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటూ శివపార్వతులను ప్రసన్నం చేసుకోవడానికి ఉపవాసం ఉంటారు. అవివాహిత బాలికలు మాస శివరాత్రి రోజున మహాదేవుని సమేతంగా పార్వతీదేవిని పూజించి కోరుకున్న వరుడితో వివాహం జరగాలని కోరుకుంటూ పూజిస్తారు. మాస శివరాత్రి పరమశివుడు, పార్వతిదేవికి అంకితం చేయబడింది. ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ రోజు చేసే పూజలతో శివుడు భక్తులకు విశేషమైన అనుగ్రహం ప్రసాదిస్తాడని నమ్మకం.
మాస శివరాత్రి రోజున కొన్ని ప్రత్యేక రకాల యాదృచ్చికలు ఏర్పడనున్నాయి. దీని కారణంగా పూజా సమయం పరిమితంగా ఉంది. గ్రహాల స్థానాలు, ప్రత్యేక తిధి కలయిక వల్ల ఈ యాదృచ్చికం ఏర్పడనున్నాయి. ఈ సమయంలో చేసే పూజకు అపారమైన ఫలితాలు ఉంటాయని నమ్మకం. ఈసారి మాస శివరాత్రి శుభ సందర్భంగా కేవలం 48 నిమిషాల సమయం మాత్రమే పూజకు అందుబాటులో ఉంటుంది.
పంచాంగం ప్రకారం భాద్రప్రద మాసం కృష్ణ పక్ష చతుర్దశి తిథి సెప్టెంబర్ 30న రాత్రి 07:06 గంటలకు ప్రారంభమై మర్నాడు అక్టోబర్ 01వ తేదీ రాత్రి 09:39 గంటలకు ముగుస్తుంది. శివ శక్తి నిషా కాలంలో మాస శివరాత్రి రోజున పూజిస్తారు. మాస శివరాత్రి సెప్టెంబర్ 30 న జరుపుకుంటారు. మాస శివరాత్రి పూజా సమయం రాత్రి 11:47 నుంచి 12:35 వరకు ఉంటుంది. అంటే కేవలం 48 నిమిషాల సమయం మాత్రమే పూజకు అందుబాటులో ఉంటుంది.
ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహీ తన్నో రుద్ర ప్రచోదయాత్
ఓం త్రయంబకం యజామహే సుగన్ధి పుష్టివర్ధనమ్ ఉర్వారుకమివ్ బన్ధనన్ మృత్యోర్ముక్షీయ మమృతాత్
మాస శివరాత్రి రోజున పవిత్రమైన యాదృచ్ఛికం ఏర్పడనుంది. పరమశివుని ప్రత్యేక అనుగ్రహాన్ని పొందడానికి ఒక సువర్ణావకాశం. ఈ ప్రత్యేక సమయంలో పూజలు చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరి జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఎందుకంటే ఈ కలయికలో చేసే పూజ గొప్ప ఫలితాలను ఇస్తుంది. ఈ సందర్భంగా ఆరాధించడం ద్వారా, ప్రజలు మోక్షాన్ని పొందుతారు. జీవితంలోని అన్ని కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి