Margashira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలంటే..

|

Dec 10, 2024 | 8:51 PM

మార్గశిర పౌర్ణమి రోజున శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. ఈ రోజున గంగా స్నానం చేయడం దానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మార్గశిర పౌర్ణమి రోజు దానం చేయడం వల్ల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది. ఈ శుభదినాన ఏ రాశి వారు ఏమి దానం చేయడం శుభప్రదమో తెలుసుకుందాం.

Margashira Purnima: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలంటే..
Margashira Purnima
Follow us on

హిందూ మతంలో మార్గశిర పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ప్రపంచ సృష్టికర్త అయిన శ్రీ మహా విష్ణువు, లక్ష్మీ దేవిని పూజిస్తారు. గంగా స్నానం, మార్గశిర పౌర్ణమి రోజున చేసే దానాలకు కూడా చాలా శుభప్రదమైనవి. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున ఎవరు దానధర్మాలు చేస్తారో.. వారి ఇంట్లో ఆహారం, డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మార్గశిర పౌర్ణమి రోజున ఏ రాశి వారు ఎటువంటి దానం చేయడం శుభం కలుగుతుందో తెలుసుకుందాం..

మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వచ్చిందంటే

హిందూ పంచాంగం ప్రకారం పౌర్ణమి తిధి డిసెంబర్ 14 సాయంత్రం 4:58 గంటలకు ప్రారంభమై డిసెంబర్ 15 మధ్యాహ్నం 2:31 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం మార్గశిర పౌర్ణమి ఈసారి డిసెంబర్ 15 న జరుపుకోనున్నారు.

ఏ రాశి వారు ఏ వస్తువులను దానం చేయాలంటే

  1. మేష రాశి వారు మార్గశిర పౌర్ణమి రోజున గోధుమలు, బెల్లం దానం చేయడం శుభప్రదం.
  2. వృషభ రాశి వారు బియ్యం, పంచదార దానం చేయడం శుభప్రదం.
  3. ఇవి కూడా చదవండి
  4. మిథున రాశి వారు మార్గశిర పౌర్ణమిన పూర్ణ చంద్రుడు అనుగ్రహం కోసం కూరగాయలను దానం చేయడం శుభప్రదం.
  5. కర్కాటక రాశి వారు ఈ రోజున పాలు, పెరుగు దానం చేయడం శుభప్రదం. దీంతో వీరి జాతకంలో గ్రహాలు బలపడతాయి.
  6. సింహరాశి వారికి వేరుశెనగ, తేనె దానం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ఈ రాశుల వారికి ధనలాభం కలిగే అవకాశాలున్నాయి.
  7. కన్యా రాశి వారికి మొక్కజొన్న, చెరకు దానం చేయడం శుభప్రదం.
  8. తులారాశి వారు తెల్లని వస్త్రాలను దానం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం లభిస్తుంది.
  9. వృశ్చిక రాశి వారు మార్గశిర పౌర్ణమి రోజున ఎరుపు రంగు దుస్తులను దానం చేయడం శుభప్రదం. ఇది వీరి జీవితంలో ఆనందాన్ని నింపుతుంది.
  10. ధనుస్సు రాశి వారు ఈ రోజు పసుపు రంగు దుస్తులు దానం చేయడం శుభప్రదం. ఇలా చేయడం వల్ల ధనుస్సు రాశి వారి పట్ల విష్ణువు ప్రసన్నుడవుతాడు.
  11. మకర రాశి మార్గశిర పౌర్ణమి రోజున పాదరక్షలు, చెప్పులు, గొడుగు దానం చేయడం శుభప్రదం. ఇది వీరికి శుభ ఫలితాలను ఇస్తుంది.
  12. కుంభ రాశి వారు ఈ రోజున నీలిరంగు వస్త్రాలు, నల్ల నువ్వులు దానం చేయడం శుభప్రదం. దీంతో కుంభ రాశి వారికి శని గ్రహదోషం తొలగిపోతుంది.
  13. మీన రాశి వారికి పండిన అరటిపండ్లు, బొప్పాయి దానం చేయడం శుభప్రదం. దీంతో ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.