Isha Foundation Mahashivratri LIVE: ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి వేడుకలు తమిళనాడులోని కోయంబత్తూరులో భక్తిప్రపత్తులతో నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. “సద్గురు” గా ప్రసిద్ధులైన యోగి, మార్మికులు, ఈశా ఫౌండేషన్ సంస్థాపకులు జగ్గీ వాసుదేవ్ లాభాపేక్ష లేకుండా ఈశా ఫౌండేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ఇండియా, అమెరికా, ఇంగ్లాండ్, లెబనాన్, సింగపూర్, కెనడా, మలేషియా, ఉగాండా, ఆస్ట్రేలియా వంటి అనేక దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థ అనేక సామాజిక ఆభివృద్ధి కార్యక్రమాలలో కూడా పాల్గొంటుంది, అందువల్లే ఈ సంస్థ ఐక్యరాజ్యసమితి ఆర్ధిక, సామాజిక సంస్థకి ప్రత్యేక సలహాదారుగా నియమించబడింది. ఇతని సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2017 సంవత్సరంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. ఇలాఉండగా, హరహర మహాదేవ శంభోశంకర… అంటూ శివాలయాలు ఆ గరళకంఠుడి స్మరణతో మారుమోగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా దేశవ్యాప్తంగా టెంపుల్స్‌లో ప్రత్యేక పూజలు చేశారు భక్తులు. వేకువజాము నుంచే ఆ పశుపతిని స్మరిస్తూ..భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.