Mahabharatam: శ్రీ కృష్ణుడు తన మేనల్లుడైన అభిమన్యుడిని ఎందుకు రక్షించలేదు? 16 ఏళ్లలోనే ఎందుకు మరణించాడంటే..?

|

Oct 22, 2024 | 4:33 PM

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం అంటే వెంటనే వీరాధి వీరుడు అభిమన్యుడు గుర్తుకోస్తాడు. అదే సమయంలో శ్రీ కృష్ణుడు తలచుకుంటే తన మేనల్లుడైన అభిమన్యుని రక్షించగలిగేవాడు అని కూడా అనుకుంటారు. అయితే పాండవుల మధ్యముడు అర్జునుడి 16 ఏళ్ల కొడుకు అభిమన్యుడు మరణం ఎందుకు అవసరం? మహాభారతంలో గొప్ప యోధుడిగా పేరుపొందిన అభిమన్యుడు కేవలం 16 సంవత్సరాల వయస్సులో అభేద్యమైన పద్మ వ్యూహంలో ప్రవేశించాడు.. వీరాధి వీరులతో పోరాటం చేసి వీర మరణం పొందాడు. అయితే అర్జునుడి కొడుకు , కృష్ణుడు మేనల్లుడు అయిన అభిమన్యుడు ప్రాణాలను యుద్ధంలో ఎందుకు రక్షించలేదంటే..

Mahabharatam: శ్రీ కృష్ణుడు తన మేనల్లుడైన అభిమన్యుడిని ఎందుకు రక్షించలేదు? 16 ఏళ్లలోనే ఎందుకు మరణించాడంటే..?
Mahabharatam Epic Story
Image Credit source: social media
Follow us on

మహాభారతంలో పాండవుల మధ్యముడు విలుకాడు అర్జునుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర కుమారుడు అభిమన్యు గురించి అందరికీ తెలుసు. వీరాధి వీరుడైన అభిమన్యుని మరణం గురించి కథ కూడా చాలా ప్రజాదరణ పొందింది. మహాభారత యుద్ధంలో అభిమన్యుడు కౌరవులు వేసిన పద్మ వ్యూహాన్ని బద్దలు కొట్టి అందులో ప్రవేశించాడు. అనేక మంది యోధులను ఒంటరిగా సంహరించాడు. అయితే అభిమన్యుడు జన్మించక ముందే.. అంటే సుభద్ర కడుపులో ఉన్న సమయంలో పద్మ వ్యూహాన్ని ఛేదించగల జ్ఞానాన్ని సంపాదించాడు. అయితే దాని నుంచి బయట పడే విధానం తెలియక మరణించాడు.

అభిమన్యుడి నైపుణ్యం ముందు కౌరవులందరూ ఓడిపోయారు. తరువాత చాలా మంది యోధులు నిరాయుధుడు, ఒంటరిగా ఉన్న అభిమన్యుని చుట్టుముట్టి అతన్ని సంహరించారు. అభిమన్యుడు కేవలం 16 సంవత్సరాల వయస్సులో అమరవీరుడు అయ్యాడు. అభిమన్యుడు సంహరించే సమయంలో యుద్ధభూమిలో శ్రీకృష్ణుడు ఉన్నాడు. అయినా తన ప్రియమైన మేనల్లుడిని రక్షించలేకపోయాడు. దీని వెనుక ఓ ప్రత్యేక కారణం ఉందని పురాణాల కథనం.

అభిమన్యు పుట్టకముందే మరణం నిర్ణయం

ఇవి కూడా చదవండి

అభిమన్యు పుట్టకముందే.. అతని తండ్రి మరణ వయస్సును నిర్ణయించాడు. అభిమన్యు తండ్రి అర్జునుడు కాదు చంద్రుడు. వాస్తవానికి మహాభారతంలో చంద్రుడి కొడుకు వర్చ అర్జునుడి కొడుకు అభిమన్యుగా జన్మించాడు. ఈ విషయం గురించి ప్రస్తావన మహాభారతంలో ఉంది.

అభిమన్యుడు చంద్రుడి కుమారుడు.

శ్రీ కృష్ణ భగవానుడు ధర్మ రక్షణ కోసం భూమిపై అవతరించబోతున్న సమయంలో దేవీ, దేవతలందరూ ఏదో ఒక రూపంలో భూమిపైకి వచ్చి భగవంతుని లీలాను చూడాలని నిర్ణయించుకున్నారు. చాలా మంది దేవీ, దేవతలు భూమిపై మానవులుగా జన్మించారు, చాలా మంది తమకు బదులుగా తమ కుమారులను భూమికి పంపారు. ఇలా సూర్యుని కుమారుడు కర్ణుడు, ఇంద్రుని కుమారుడు అర్జునుడు. జన్మించగా.. చంద్రుడు తనయుడు ‘వర్చ’ను భూలోకంలో జన్మించేందుకు అనుమతించాలని కోరారు. అయితే చంద్రుడుకి తన కొడుకు అంటే చాలా ప్రేమ. తను తన కొడుక్కి దూరంగా ఉండడానికి ఇష్టపడలేదు.

అందుకే శ్రీ కృష్ణుడు అభిమన్యుని రక్షించలేదు
దేవతలందరూ చంద్రుడు తనయుడు భూమి మీద జన్మించే వరాన్ని ఇవ్వమని కోరాడు. అప్పుడు చంద్రదేవుడు అంగీకరించాడు. అయితే తన కొడుకును 16 సంవత్సరాలు మాత్రమే భూమిపైకి పంపగలనని.. ఆ తర్వాత తన వద్దకు తిరిగి వచ్చేయ్యాలని చెప్పాడు. అలా చంద్రుడు కొడుకు అర్జునుడి కొడుకుగా అభిమన్యుడుగా జన్మించాడు. 16 సంవత్సరాల తర్వాత చంద్రుడి కుమారుడిని తిరిగి అతని వద్దకు పంపుతానని శ్రీ కృష్ణుడు చంద్రుడికి వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం కారణంగా అభిమన్యు 16 సంవత్సరాల వయస్సులో అమరవీరుడు అయ్యాడు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)