Vastu Tips: ఇంట్లో ఎప్పుడూ గొడవలేనా.. కిచెన్‌లో ఈ వస్తువులు పెట్టండి..
ఇంట్లో తరచూ గొడవలు పడుతూ, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సారి ఇలా చేయండి. వాస్తు ప్రకారం.. కొన్ని రకాల వస్తువులను బట్టి కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోమని చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వంట గదిని మరింత క్లీన్‌గా ఉంచుకోవాలి. ఇంటి వంట గది ఎప్పుడూ ఆగ్నేయ దిశలోనే నిర్మించాలి. లేకపోతే ఇంట్లో గొడవలు జరగడం, మనస్పర్థలు..
Updated on: Oct 22, 2024 | 6:50 PM

ఇంట్లో తరచూ గొడవలు పడుతూ, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే ఈ సారి ఇలా చేయండి. వాస్తు ప్రకారం.. కొన్ని రకాల వస్తువులను బట్టి కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోమని చెబుతూ ఉంటారు.

ముఖ్యంగా వంట గదిని మరింత క్లీన్‌గా ఉంచుకోవాలి. ఇంటి వంట గది ఎప్పుడూ ఆగ్నేయ దిశలోనే నిర్మించాలి. లేకపోతే ఇంట్లో గొడవలు జరగడం, మనస్పర్థలు రావడం కామన్.

వంటగదిని చాలా మంది ఈశాన్య దిశలోనే ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటాయట. ఇంట్లో కుటుంబ సభ్యులు సఖ్యత కూడా కోల్పోతూ ఉంటారు.

వాస్తు ప్రకారం కిచెన్ ఎప్పుడూ ఆగ్నేయ దిశలో తూర్పుకు తిరిగి వంట చేస్తూ ఉండాలి. ఇదే సరైన నియంగా చెబుతూ ఉంటారు. చాలా మందికి తెలియకుండా గ్యాస్ స్టవ్ పక్కన, సింగ్ దగ్గర ఇతర వస్తువులు కూడా పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకండి.

ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటే.. మీ వంట గదిలో నల్ల నువ్వులు లేదా నల్ల మిరియాలను ఒక మూట కట్టి పక్కన పెట్టాలి. అప్పుడప్పుడు వాటికి అగరుబత్తీలు చూపిస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఇంట్లో గొడవలు తగ్గుతాయి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)




