Vidura Niti: వీరు స్నేహం ముసుగులో ఉన్న శత్రువులు.. ఈ ఐదుగురిని గుర్తుంచి దూరం పెట్టడం మేలు అంటున్న విదుర

మారుతున్న కాలాన్ని బట్టి కొన్ని నీతుల గురించి అభిప్రాయాలూ మారుతున్నాయి. అయితే కొన్ని మాత్రం యుగాలు మారినా మారవు. అటువంటి వాటిల్లో ఒకటి విదుర నీతి. సమాజానికి ఉపయోగపడే విదుర నీతులకు ఏ యుగంలోనైనా విలువ అలాగే చెక్కుచెదరకుండా ఉంటుంది. నీతి తప్పిన మనిషి సంచరించే సమాజంలో అశాంతి నెలకొంటుంది. విదుర నీతి ప్రకారం ఇటువంటి స్నేహితులు.. శత్రువుల కంటే ప్రమాదకరమైనవారు. జాగ్రత్తగా ఉండమన్న విదుర

Vidura Niti: వీరు స్నేహం ముసుగులో ఉన్న శత్రువులు.. ఈ ఐదుగురిని గుర్తుంచి దూరం పెట్టడం మేలు అంటున్న విదుర
Vidura Niti

Updated on: Jun 28, 2025 | 5:05 PM

స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అన్నాడో సినీ కవి. అవును స్నేహం జీవితంలో అత్యంత అందమైన విషయం. అయితే ప్రతి స్నేహితుడు నిజంగా మీకు స్నేహితుడేనా? ఈ విషయం గురించి విదుర తన నీతి గ్రంథంలో అనేక విషయాలను వెల్లడించారు. అవి నేటికీ అంతే ముఖ్యమైనవి. మీతో ఉన్నట్లు.. మీ మేలు కోరుకున్నట్లు కనిపించే కొంతమంది స్నేహితులు ఉంటారని.. వాస్తవానికి కొంతమంది స్నేహం ముసుగులో మీకు అతిపెద్ద శత్రువులని విదుర నీతి మనకు చెబుతుంది. కనుక స్నేహం అనే ముసుగు ధరించే అతిపెద్ద శత్రువులైన స్నేహితులను ఎలా గుర్తించాలో ఈ రోజు తెలుసుకుందాం..

స్వార్థపూరిత స్నేహితులు : తమ ప్రయోజనాల కోసం మాత్రమే మీతో సంబంధాన్ని కొనసాగించే స్నేహితులు మీ నుంచి ఎటువంటి ప్రయోజనం లభించదని తెలిసిన వెంటనే.. అతను చేసే మొదట పని మిమ్మల్ని వదిలివేయడమే. అలాంటి వ్యక్తులు మీ స్నేహాన్ని వారి సొంత ప్రయోజనం కోసం మాత్రమే ఉపయోగించుకుంటారు. అంతేకాదు సంక్షోభ సమయాల్లో మీకు అండగా ఉండరు.

సానుభూతిపరులైన స్నేహితులు: మిమ్మల్ని ఎప్పుడూ సమయం సందర్భం లేకుండా పొగడమే కాదు.. మీ తప్పులను కూడా పొగుడుతూ.. మీ తప్పులను కప్పిపుచ్చే స్నేహితుల నుంచి వీలైంత దూరంగా ఉండండి. ఎందుకంటే ఇటువంటి వ్యక్తులు మీకు నిజమైన శ్రేయోభిలాషులు కాదు. ఎందుకంటే అటువంటి వ్యక్తులు మీ తప్పు, ఒప్పుల మధ్య తేడాను గుర్తించనివ్వరు. మీ పురోగతికి అడ్డంకిగా మారతారు. అంతేకాదు ఇటువంటి వారు మీ వెనుక మీ గురించి చెడుగా మాట్లాడేందుకు కూడా వెనుకాడరు.

ఇవి కూడా చదవండి

మోసపూరిత స్నేహితులు : పైకి చాలామంచిగా ప్రవర్తించి.. రహస్యంగా మీకు వ్యతిరేకంగా కుట్ర పన్నేవారు లేదా ఎల్లప్పుడూ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించేవారు అత్యంత ప్రమాదకరమైనవారు. అలాంటి స్నేహితులు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచి.. మీరు కోలుకోవడానికి ఎప్పటికీ అవకాశం ఇవ్వరు.

కష్ట సమయాల్లో మిమ్మల్ని విడిచిపెట్టే స్నేహితులు: మంచి సమయాల్లో మాత్రమే మీతో ఉండి, కష్ట సమయాల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళే వ్యక్తులు ఎప్పటికీ నిజమైన స్నేహితులు కాలేరు. అలాంటి స్నేహితులు కష్ట సమయాల్లో మీ బలం కంటే బలహీనంగా మారతారని విదురుడు చెప్పాడు.

అసూయపడే స్నేహితులు : కొంతమంది స్నేహితులు మీ విజయం , ఆనందాన్ని చూసి అసూయపడతారు. వీరు మీ ముందు సంతోషంగా ఉన్నట్లు నటిస్తారు. అయితే వీరి మనస్సులో స్నేహితుల పురోగతి పట్ల అసంతృప్తిగా ఉంటారు. దీంతో మిమ్మల్ని అవమానించడానికి ఏ మాత్రం అవకాశం వచ్చినా వదులుకోరు. అలాంటి వ్యక్తులు మీరు అభివృద్ధి చెందడం ఎప్పుడూ చూడలేరు. మీకు తెలియకుండా నిశ్శబ్దంగా మీకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు