Mahabharat: శ్రీ కృష్ణుడు.. శిశుపాలుడు 100 తప్పులు పూర్తి అయ్యే వరకూ ఎందుకు వధించలేదో తెలుసా..!

|

Aug 13, 2024 | 10:56 AM

శ్రీ విష్ణువు అవతారమైన కృష్ణుడుకి సంబంధించిన అనేక రహస్యాలు, కథలు మహాభారతంలో ఉన్నాయి. వీటి గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాటిలో ముఖ్యమైనది శ్రీ కృష్ణుడు, శిశుపాలుని మధ్య సంబంధం. అయితే ఈ కారణంగానే కాదు.. శ్రీ కృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకూ ఎందుకు క్షమించాడు అన్న మరొక సందేశం చాలా మందికి కలుగుతుంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే..?

Mahabharat: శ్రీ కృష్ణుడు.. శిశుపాలుడు 100 తప్పులు పూర్తి అయ్యే వరకూ ఎందుకు వధించలేదో తెలుసా..!
Krishna And Shishupal
Follow us on

పంచమ వేదంగా కీర్తించబడుతున్న మహా భారతాన్ని వేద వ్యాసుడు రచించాడు. ఇందులోని అన్ని పాత్రలు పరిశీలిస్తే నేటికీ ఏదోక రూపంలో కనిపిస్తాయని పెద్దల నమ్మకం. మహా భారతంలో పాండవులు, కౌరవులు, శ్రీ కృష్ణుడు మాత్రమే కాదు అనేక ముఖ్యమైన పాత్రలున్నాయి. శ్రీ విష్ణువు అవతారమైన కృష్ణుడుకి సంబంధించిన అనేక రహస్యాలు, కథలు మహాభారతంలో ఉన్నాయి. వీటి గురించి ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాటిలో ముఖ్యమైనది శ్రీ కృష్ణుడు, శిశుపాలుని మధ్య సంబంధం. అయితే ఈ కారణంగానే కాదు.. శ్రీ కృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకూ ఎందుకు క్షమించాడు అన్న మరొక సందేశం చాలా మందికి కలుగుతుంది. దీని వెనుక ఉన్న కథ ఏమిటంటే..?

శిశుపాలుడు ఎవరు?

శిశుపాలుడు శ్రీ కృష్ణుని మధ్య బావ బావమరిదిల సంబంధం ఉంది. శిశుపాలుడు ఛేది రాజ్య చక్రవర్తి ధర్మఘోషుని కుమారుడు. తల్లి వసుదేవుని సోదరి శ్రుతదేవి. అంటే శ్రీ కృష్ణుడి మేనత్త.  శిశిపాలుడు పుట్టినప్పుడు.. చాలా వింతగా కనిపించాడు. ఆ సమయంలో శిశుపాలుడికి మూడు కళ్ళు, నాలుగు చేతులు ఉన్నాయి. పుట్టిన శిశివు వికృత రూపాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన మేనత్తకు కొడుకు పుట్టాడన్న వార్త విన్న శ్రీకృష్ణుడు తన అన్న బలరాంతో కలిసి మేనత్త దగ్గరకు వచ్చాడు. అప్పుడు మేనత్త విచారంగా ఉండడాన్ని చూసి కృష్ణుడు కారణం అడిగాడు. అప్పుడు కృష్ణుడు మేనత్త శిశుపాలుడి గురించి చెప్పింది.

ఇవి కూడా చదవండి

శ్రీ కృష్ణుడు శిశుపాలుడిని చూడాలనే కోరికను వ్యక్తం చేశాడు

కృష్ణుడు తన బావను చూడాలని ఉండనే కోరికను అత్త శ్రుతదేవితో చెప్పాడు. అప్పుడు శ్రుతదేవి తన కుమారుడిని తీసుకుని వచ్చి.. బలరాముడిని, శ్రీ కృష్ణుడిని ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకోమ్మని చూచించింది. ముందుగా బలరాముడు ఆ చిన్నారి వింత బాలుడిని తన ఒడిలోకి తీసుకున్నాడు. అప్పుడు ఆ చిన్నారిలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే అన్న బలరాముడి ఒడి నుంచి శ్రీ కృష్ణుడు తన ఒడిలోకి తీసుకున్నాడు. వెంటనే ఆ చిన్నారి పెద్దగా ఏడవడం మొదలు పెట్టాడు. అంతేకాదు ఎక్కువగా ఉన్న చేతులు, కళ్లు విడిపోయి నేలపై పడ్డాయి. ఇదంతా చూసిన శ్రీకృష్ణుని మేనత్త తన మేనల్లుడైన కృష్ణుడు పాదాలపై పడి ఏడవసాగింది.

తన అత్తకు మాట ఇచ్చిన శ్రీ కృష్ణుడు

తన కాళ్ల మీద పడిన మేనత్తను లేవదీసిన శ్రీ కృష్ణుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు శ్రుతదేవి తనకు పుట్టే పిల్లవాడు రాక్షస ప్రవృత్తితో ఉంటాడని.. ఎవరి ఒడిలోకి చేరిన తర్వాత అతని అదనపు అవయవాలు పడిపోతాయో.. ఆ వ్యక్తి చేతిలో తన కుమారుడి మరణం రాసి ఉందని జ్యోతిష్యులు చెప్పారని కృష్ణుడికి చెప్పింది. అంతేకాదు ఓ కృష్ణా నీ సొంత బావను చంపి మేనత్తకు గర్భ శోకాన్ని ఎలా ఇస్తావు.. కనుక నాకు ఒక మాట ఇవ్వు అంటూ కృష్ణుడిని అర్ధించింది. అంతేకాదు శిశిపాలుడిని ఎల్లప్పుడూ రక్షిస్తానని.. చంపే ఆలోచన చేయనని తనకు వాగ్దానం చేయమని మేనల్లుడైన శ్రీకృష్ణుడిని ప్రార్ధించింది.

100 తప్పులను క్షమించిన కృష్ణుడు

తన అత్త మాటలు విన్న తర్వాత శ్రీ కృష్ణుడు తన పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలాలు ప్రతి జీవి జనన మరణాలు ముడిపడి ఉన్నాయని ఆమెకు వివరించాడు. ఈ జన్మలో సాధించిన ప్రతి కార్యమూ గత జన్మలో చేసిన కర్మల ఫలితమే. ఈ జన్మలో ఈ చిన్నారి మరణాన్ని నా చేతుల్లో రాసి పెడితే ఎవరూ మార్చలేరు.అంటూ ఏడుస్తున్న తన అత్తను కృష్ణుడు ఆమెను ఓదార్చాడు. అంతేకాదు మేనత్త కొడుకు శిశిపాలుడు చేసిన 100 నేరాలను క్షమిస్తానని వాగ్దానం చేశాడు. అయితే దీని తరువాత అతను తన కర్మకు తగిన ఫలితాలను అనుభవించవలసి ఉంటుందని చెప్పాడు. కృష్ణుడు చేసిన వాగ్ధానంతో మేనత్త తృప్తి చెందింది. తన కుమారుడు 100 తప్పులు చేయకుండా ఉండేలా చూసుకోవాలని ఈ విషయాన్నీ తన బిడ్డకు వివరించాలని నిర్ణయించుకుంది.

100 తప్పులు పూర్తి

కాలక్రమంలో శ్రీకృష్ణుడు రుక్మిణిని ప్రేమించాడు. అదే సమయంలో శిశుపాలుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. శ్రీ కృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నప్పుడు.. శిశుపాలుడు అది తనకు అవమానంగా భావించాడు. శ్రీ కృష్ణుడిని తన శత్రువుగా భావించడం ప్రారంభించాడు. తరువాత ధర్మరాజు యుధిష్ఠిరుడు నిర్వహించిన రాజసూయ యాగంలో శ్రీకృష్ణుని గౌరవంగా చూడడం.. యాగంలో కృష్ణుడిని ఇచ్చిన ప్రాముఖ్యతను చూసి శిశుపాలుడు అసూయ చెంది శ్రీకృష్ణుడిని అవమానించడం మొదలుపెట్టాడు. శ్రీ కృష్ణుడు శిశుపాలుడి వంద తప్పులను క్షమించాడు. శిశుపాలుడు 101 సారి అవమానించినప్పుడు… శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రంతో శిశుపాలుడిని వధించాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు