జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా సంచరించడం ద్వారా శుభ, అశుభ యోగాలు కలుగుతాయి. ఈ ప్రభావం మనుషులపై ఉంటుంది. అయితే, ఫిబ్రవరి 18 న మహా శివరాత్రి రోజున కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. త్రిగ్రాహి యోగంలో సూర్యుడు, చంద్రుడు, శని గ్రహాలు ఒకే రాశిలోకి వస్తాయి. ఈ ప్రభావం ఆయా రాశులపై పడుతుంది. అయితే, కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపితే.. కొన్ని రాశులపై చెడు ప్రభావం చూపుతాయి. అయితే, యోగం వల్ల ప్రత్యేకించి 3 రాశిచక్రాల వారికి అంతా శుభమే జరుగుతుందని వేదపండితులు చెబుతున్నారు. వీరు చేపట్టిన ప్రతికార్యం విజయవంతం అవడమే కాకుండా, ధనలాభం, వస్తు లాభం, ఆస్తి ప్రాప్తించడం, అదృష్టం వరిస్తుందని చెబుతున్నారు. మరి జ్యోతిష్య, వేద పండితులు చెబుతున్న ఆ 3 రాశులు ఏంటి? వారికి కలిగే ఆ శుభపరిణామాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
త్రిగ్రాహి యోగం వలన మేష రాశి వారికి అంతా మంచే జరుగుతుంది. వీరి ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఉన్నతి పొందుతారు. వ్యాపారంలో వృద్ధి సాధిస్తారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న కోరికలు నెరవేరుతాయి.
ఈ రాశి వారు వ్యాపారంలో అపారమైన లాభాలు ఆర్జిస్తారు. త్రిగ్రామి యోగం ఏర్పడిన సమయంలో వ్యాపార్తులకు మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగులు కొత్త జాబ్ ఆఫర్స్ అందుకుంటారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. కొత్త బాధ్యతలు అందుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
ఈ రాశి వారికి కూడా అంతా శుభమే జరుగుతుంది. సంపద పెరుగుతుంది. ఆకస్మిక ధనం కలుగుతుంది. పిల్లలకు సంబంధించి కొన్ని శుభవార్తలు ఉంటాయి. వ్యాపారంలో ఎనలేని వృద్ధి సాధిస్తారు. ఈ రాశివారు తమ వాక్పటిమతో.. ప్రజలను ఆకట్టుకుంటారు.
గమనిక: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, మత విశ్వాసాల ఆధారంగా ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..