కుంభమేళాలో రాజ స్నానానికి ప్రాముఖ్యత.. త్రివేణీ సంగమం వద్దనే రాజ స్నానం ఎందుకు చేస్తారంటే..

|

Dec 09, 2024 | 6:19 PM

12ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా జాతర కు ప్రయాగ్ రాజ్ ముస్తాబవుతుంది. కొత్త సంవత్సరంలో జరగనున్న కుంభమేళా, మహాకుంభ మేలా సమయంలో త్రివేణి సంగమం ఒడ్డున ప్రత్యేక స్నానం చేస్తారు. ఈ స్నానాన్ని రాజ స్నానంగా పరిగణిస్తారు. అయితే త్రివేణి సంగమం ప్రాంతంలో మాత్రమే రాజ స్నానం ఎందుకు చేస్తారు? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

కుంభమేళాలో రాజ స్నానానికి ప్రాముఖ్యత.. త్రివేణీ సంగమం వద్దనే రాజ స్నానం ఎందుకు చేస్తారంటే..
Kumbhamela Shahi Snan
Follow us on

గంగతో సహా అన్ని నదులు ఎక్కడో చోట కలుస్తాయి. అంటే నదులన్నింటికీ ఎక్కడో ఒకచోట సంగమం ఉంటుంది. అన్ని నదులకు వాటి సొంత సంగమ ప్రాంతాలు ఉన్నాయి. అయితే వీటన్నింటిలో త్రివేణి సంగమానికి చాలా ప్రాముఖ్యత ఉంది. గంగా, యమునా, సరస్వతి అనే మూడు నదులు కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఈ మూడు నదులు ప్రయాగ్‌రాజ్‌లోని సంగం వద్ద కలుస్తాయి. దీంతో ఈ ప్రయాగ్‌రాజ్ ఒక యాత్రా స్థలంగా ప్రసిద్ధిగాంచింది.

ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న గంగా, యమునా, సరస్వతి సంగమం ప్రదేశం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. హిందూ సంస్కృతిలో గంగా, యమునా నదుల తర్వాత సరస్వతి నదికి అత్యంత ప్రాధాన్యత ఉంది. హిందూ మతంలో అన్ని పుణ్యక్షేత్రాలు నదుల ఒడ్డున ఉన్నాయని నమ్ముతారు. ఇందులోనూ మూడు నదులు కలిసే ప్రదేశానికి విశేష ప్రాధాన్యత ఉంది. ఈ మూడు నదుల కలయికను ప్రయాగ్‌రాజ్‌లో చూడవచ్చు.

ప్రయాగ తీర్థయాత్రలకు రాజు ఎందుకంటే.

ప్రయాగ్‌రాజ్ లోని త్రివేణీ సంగమం వద్ద గంగా, యమునా నదులు విడివిడిగా కనిపిస్తాయి. రెండు నదుల నీరు కలిసే చోట రంగు తేడా స్పష్టంగా చూడవచ్చు. అయితే ఇక్కడ సరస్వతి నది అంతర్వహినీ గా ప్రవహిస్తూ మిళితమై ఉంటుంది. అందుకనే ప్రయాగ తీర్థయాత్రల రాజుగా పరిగణించబడుతుంది. మహా కుంభమేళా, కుంభమేళా, అర్ధ కుంభమేళా వంటి కార్యక్రమాలలో ఎవరైతే త్రివేణి సంగమంలో స్నానం చేస్తారో వారు మోక్షాన్ని పొందుతారని నమ్మకం. మహా కుంభమేళా, కుంభమేళా, అర్ధ కుంభమేళా సమయంలో చేసే ఒక స్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అది రాజ స్నానం. మహా కుంభమేళా, కుంభమేళా, అర్ధ కుంభమేళా సమయంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద రాజ స్నానం చేయడానికి వస్తారు.

ఇవి కూడా చదవండి

కుంభ మేలా సమయంలో చేసే స్నానాన్ని రాజ స్నానం అని ఎందుకు అంటారంటే

మహా కుంభమేళా, కుంభమేళా, అర్ధ కుంభమేళా సమయంలో అఖారాలు, సాధువులు బంగారు-వెండి పల్లకీలు, ఏనుగులు, గుర్రాలపై కూర్చుని నదిలో స్నానం చేయడానికి వస్తారు. ఈ సమయంలో ఒక్కరూ తమ శక్తి,కీర్తిని ప్రదర్శిస్తారు. అందుకనే ఈ స్నానాన్ని రాజయోగ స్నానం లేదా రాజ స్నానం అంటారు. కుంభమేళా సమయంలో గ్రహాలు, నక్షత్రరాశుల ప్రత్యేక స్థానం కారణంగా నదిలోని నీరు అద్భుతంగా మారుతుంది. గ్రహాలు, రాశులు శుభ స్థితిలో ఉన్నప్పు రాజ స్నానం చేస్తారు. ఇలా స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు నశించి, ఆత్మ శుద్ధి పొంది మోక్షం వైపు పయనిస్తుందిని నమ్మకం. 2025 లో ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా సందర్భంగా వివిధ అఖారాలకు చెందిన ఋషులు,సాధువులు సమావేశం కానున్నారు.

 

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.