TTD News: చెన్నైలో కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం.. వేదమంత్రోచ్ఛరణల నడుమ పరిణయం

చెన్నై(Chennai) లోని ఐలాండ్ మైదానంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేద...

TTD News: చెన్నైలో కన్నులపండువగా శ్రీనివాస కల్యాణం.. వేదమంత్రోచ్ఛరణల నడుమ పరిణయం
Chennai Ttd

Updated on: Apr 17, 2022 | 8:09 AM

చెన్నై(Chennai) లోని ఐలాండ్ మైదానంలో శ్రీనివాస కల్యాణం వైభవంగా జరిగింది. శనివారం సాయంత్రం వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవ మూర్తులను కల్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, కంకణధారణ, అగ్నిప్రతిష్టాపన, యజమాని సంకల్పం, భక్త సంకల్పం, మహాసంకల్పం, మంగళసూత్రధారణ ఘట్టాలతో వేదమంత్రాలు పఠిస్తూ శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు. చివరిగా నక్షత్రహారతి, మంగళహారతి కార్యక్రమంతో రాత్రి 9.10 గంటలకు కల్యాణం దిగ్విజయంగా ముగిసింది. శ్రీవారు, అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి భక్తిపరవశంతో పులకించారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్. రవి, టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవీ.సుబ్బారెడ్డి దంపతులు, ఈవో కేఎస్‌. జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంపతులు, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి దంపతులు, టీటీడీ పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు.

 

Also Read

కిచిడిలో ఉప్పు ఎక్కువైందని ఘాతుకం.. భార్యపై భర్త ఏం చేశాడో తెలుసా..?

Viral Video: వంతెనపై ఫుల్ స్పీడ్‌లో కారు.. ఒక్కసారిగా కిందకు దూకేశాడు.. మైండ్ బ్లాంక్ వీడియో..!

Lemon Leaves Benefits: నిమ్మ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు..!