- Telugu News Photo Gallery Lemon Leaves Benefits Lemon leaves is best in skin care know its beauty benefits
Lemon Leaves Benefits: నిమ్మ ఆకులతో అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే అస్సలు వదలరు..!
డార్క్ సర్కిల్స్: పనిభారం, ఒత్తిడి, అలసట ప్రభావం ముఖంపై నల్లటి వలయాల రూపంలో కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి, నిమ్మ ఆకుల సహాయం తీసుకోవచ్చు. ఒక పాత్రలో నిమ్మ ఆకుల పేస్ట్ వేసి దానికి రెండు చెంచాల తేనె కలపాలి. దీన్ని కళ్ల చుట్టూ రాసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Updated on: Apr 17, 2022 | 6:21 AM

డార్క్ సర్కిల్స్: పనిభారం, ఒత్తిడి, అలసట ప్రభావం ముఖంపై నల్లటి వలయాల రూపంలో కనిపిస్తుంది. ఈ సమస్యను అధిగమించడానికి, నిమ్మ ఆకుల సహాయం తీసుకోవచ్చు. ఒక పాత్రలో నిమ్మ ఆకుల పేస్ట్ వేసి దానికి రెండు చెంచాల తేనె కలపాలి. దీన్ని కళ్ల చుట్టూ రాసి చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

క్లీన్ స్కిన్: క్లీన్ స్కిన్ కోసం.. నిమ్మ ఆకులు అద్భుతంగా పని చేస్తాయి. నిమ్మ ఆకుల రసాన్ని తీసుకుని.. దానికి ఒక చెంచా అలోవెరా జెల్‌ను కలపాలి. అలాగే ఒక చెంచా పూదీనా ఆకుల రసాన్ని కలపాలి. ఈ పేస్ట్‌ను కాటన్‌తో ముఖానికి అప్లై చేయాలి. కాసేపు ఉంచి పొడి కాటన్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

మృదువైన చర్మం: మృదువైన చర్మం కోసం నిమ్మ ఆకులతో చేసిన ఔషదాన్ని ట్రై చేయండి. కొబ్బరినూనె తీసుకుని అందులో నిమ్మ ఆకుల రసం కలపాలి. ఆ మిక్స్‌ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేయాలి. దీన్ని రెగ్యులర్‌గా చేయడం వల్ల మీ చర్మం మృదువుగా మారుతుంది.

మొటిమలు: నిమ్మకాయ వలె, దాని ఆకులు కూడా చర్మంపై మొటిమలను తొలగించడంలో ప్రభావవంతంగా పని చేస్తాయి. మొటిమలను తొలగించడానికి నిమ్మ ఆకులతో ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. రెండు మూడు చెంచాల ముల్తానీ మిట్టిని ఒక పాత్రలో తీసుకుని అందులో నిమ్మ ఆకుల రసం, తేనె కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. కొంత సమయం తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

ప్రకాశవంతమైన చర్మం: ఎండ, వేడి కారణంగా చర్మం రంగు పోతుంది. అలాంటి పరిస్థితిలో చర్మం కాంతివంతం కోసం నిమ్మ ఆకుల సహాయం తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ నిమ్మ ఆకుల రసంలో కొద్దిగా పసుపు కలిపి ముఖానికి రాసుకోవాలి.




