- Telugu News Photo Gallery Spiritual photos chanakya niti in telugu if you want tomake children successful then keep these things in mind in their upbringing
Chanakya Niti: పిల్లలు జీవితంలో విజయం సొంతం చేసుకోవాలంటే.. తల్లిదండ్రులు ఈ విషయాలు పాటించాలంటున్న చాణక్య
Chanakya Niti: తమ పిల్లలు ఎదగాలని, సమాజంలో ఎంతో పేరు సంపాదించుకోవాలని తమ కుటుంబం పేరు ప్రతిష్టలను మరింత పెంచాలని ప్రతి తల్లిదండ్రులందరి కల. ఆచార్య చాణక్యుడు పిల్లలను మెరుగ్గా పెంచడానికి కొన్ని సూచనలు చేశాడు. వీటిని ప్రతి తల్లిదండ్రులు అనుసరిస్తే.. పిల్లలు అన్నింటా విజయాన్ని సొంతం చేకుంటారు.
Updated on: Apr 16, 2022 | 7:35 PM

తల్లిదండ్రులు తమ పిల్లలు సక్సెస్ అందుకోవాలని ఆశించడం తప్పు కాదు. అయితే పిల్లలలో సంస్కృతి బీజాలను నాటడం, మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్పించినప్పుడే తల్లిదండ్రుల కల నెరవేరుతుంది. తల్లితండ్రులు ఇచ్చిన విలువలు పిల్లలను మరింతవృధ్ధిలోకి తీసుకొస్తాయి.

చాణక్య నీతి ప్రకారం, పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులకు అబద్ధం చెబుతారు. అలంటి అబద్ధాలను తల్లిదండ్రులు పట్టించుకోకుండా ఉంటె.. అలా అబద్ధాలు చెప్పడం వారి అలవాటులో భాగమైపోతుంది. ఇది వారి భవిష్యత్తును పాడుచేయడమే కాకుండా.. అవసరం అయితే తమ తల్లిదండ్రుల విషయంలో కూడా అబద్ధం చెప్పడానికి వెనుకాడరు. కనుక మొదటి సారి పిల్లలు అబద్ధం చెప్పినప్పుడే తప్పులను నిర్లక్ష్యం చేయడం తల్లిదండ్రుల సరైన దారిలో పెట్టాలి.

కొంతమంది పిల్లలు మొండిగా ఉంటారు. తల్లిదండ్రుల మాట వినరు. ఇలాంటి అలవాట్లను చిన్నతనంలోనే సరిదిద్దుకోవాలి. తల్లితండ్రులు ప్రేమతో మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం నేర్పాలి. లేకపోతే, ఈ అలవాటు పిల్లలకు హానికరం.

చాణక్యుడి ప్రకారం, పిల్లల చదువులో విషయంలో శ్రద్ధ పెట్టాలి. చదువుతో పాటు మహానుభావుల కథలు చెబుతూ మంచి పని చేసేలా వారిని ప్రేరేపించండి. దీంతో పిల్లల మనసులో మంచి ఆలోచనలు పెరిగి సమాజంలో గౌరవం సంపాదించుకునేలా ఎదగాలి అనే తపన పెరుగుతుంది. పిల్లలు స్వయంగా మంచి పనులు చేయడానికి ముందడుగువేస్తారు.

ఆచార్య చాణక్యుడు ఐదేళ్లపాటు పిల్లలను చాలా ప్రేమగా చూడాలని చెప్పాడు. ఎందుకంటే ఈ వయస్సు పిల్లలకు మంచి, చెడుల మధ్య తేడాను గుర్తించే అవగాహన ఉండదు. ఐదేళ్ల తర్వాత పిల్లలతో కొంచెం స్ట్రిక్ట్‌గా ఉండాలి. 16 సంవత్సరాల వయస్సులో, మీరు పిల్లలతో స్నేహంగా ఉండాలి.




