పెన్నానదిలో బయటపడ్డ పురాతన ఆలయం..బారులు తీరిన భక్తులు

|

Jun 17, 2020 | 2:27 PM

ఇటీవల, ఒడిశా రాష్ట్రం భువ‌నేశ్వ‌ర్‌లో సుమారు 500 ఏండ్ల కింద నదిలో మునిగిపోయిన పురాతన ఆలయం ఒకటి తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే. నయాగఢ్‌లో మహానది మధ్య ప్రాంతంలో బయటపడ్డ మందిరాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లుగా, జాతీయ కళా, సాంస్కృతిక వారసత్వం ట్రస్ట్ కు  చెందిన పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. కాగా, అటువంటిదే..ఆంధ్రప్రదేశ్‌లోనూ పురాతన ఆలయం ఒకటి బయటపడింది...

పెన్నానదిలో బయటపడ్డ పురాతన ఆలయం..బారులు తీరిన భక్తులు
Follow us on

ఇటీవల, ఒడిశా రాష్ట్రం భువ‌నేశ్వ‌ర్‌లో సుమారు 500 ఏండ్ల కింద నదిలో మునిగిపోయిన పురాతన ఆలయం ఒకటి తాజాగా బయటపడిన సంగతి తెలిసిందే. నయాగఢ్‌లో మహానది మధ్య ప్రాంతంలో బయటపడ్డ మందిరాన్ని 15వ శతాబ్దంలో నిర్మించినట్లుగా, జాతీయ కళా, సాంస్కృతిక వారసత్వం ట్రస్ట్ కు  చెందిన పురాతత్వ పరిశోధకులు గుర్తించారు. కాగా, అటువంటిదే..ఆంధ్రప్రదేశ్‌లోనూ పురాతన ఆలయం ఒకటి బయటపడింది. సుమారు 80 ఏళ్ల క్రితంలో పెన్నా నది ఇసుక మేటలో కూరుకుపోయిన నాగేశ్వరాలయంగా స్థానికులు చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామ సమీపంలో పెన్నా నది ఒడ్డున ఇసుక మేటల ధాటికి 80ఏళ్ల కిందటే నది నుంచి రెండు మైళ్లు దూరం జరిగింది. అయితే 300ఏళ్ల నాగేశ్వరాలయం మాత్రం అక్కడే ఉంది.. అది కూడా తర్వాత కనిపించకుండా ఇసుక మేట వేసింది. గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో ఆ ఆలయం వెలికి తీయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఇసుక మేట వేసిన ప్రాంతం వరకు ఇసుక రీచ్ కొరకు మెటల్ రోడ్డు నిర్మాణం చేపట్టడంతో ఆ ప్రాంతం వరకు రాకపోకలు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో ఇసుక మేటలో కూరుకుపోయి ఉన్న తమ గ్రామానికి చెందిన పురాతన దేవాలయమును వెలికితీసి అందులో ఉన్న మూలవిరాట్టును తమ గ్రామ సమీపంలో మరో గుడి నిర్మించుకోవాలని గ్రామస్తులు భావించారు. దీనిలో భాగంగా గ్రామస్తులందరూ ఓ మాట అనుకొని ఇసుక రీచ్ వారి సహాయంతో దేవాలయమును వెతికే పని మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే బుధవారం(జూన్17న) దేవాలయం గోపురం వెలుగులోకి వచ్చింది. పరశురాముడు ప్రతిష్ఠిత నాగేశ్వరస్వామికి వేమన కుటుంబీకులు నిర్మించిన ఆలయం బయటపడింది. ఈ విషయాన్ని గ్రామస్తులు దేవాదాయ శాఖకు, స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం 300 ఏళ్ల క్రితం నాటి నాగేశ్వర స్వామిగా పిలవడే శివాలయము, గ్రామం కూడా ఈ ప్రాంతంలోనే ఉండవని చెప్పారు. ఇసుక మేట ఎక్కువగా ఉండటం వల్ల 50 ఏళ్ల క్రితమే గ్రామం ఖాళీ చేసి సమీపంలో పెరుమాళ్లు పాడు గ్రామంగా నిర్మించుకున్నామని చెప్పారు. ఈ దేవాలయానికి సుమారు రెండు వందల ఎకరాల మాన్యాలు ఉన్నట్లు సమాచారం. అధికారుల అనుమతి మేరకు తమ గ్రామ సమీపంలో నూతన గుడి నిర్మించుకుంటామని గ్రామస్తులు చెబుతున్నారు.