Lord Hanuman Puja Tips: హనుమంతుని ఏ రూపాన్ని పూజిస్తే.. ఎటువంటి ఫలం లభిస్తుందో తెలుసా..

|

Jun 13, 2023 | 10:02 AM

రామ భక్తుడైన హనుమంతుడిని సంకట్ మోచనుడు అని కూడా పిలుస్తారు. హనుమంతుడిని అనేక రూపాల్లో పూజిస్తారు. ఈ పవనపుత్రుడిని భిన్న రూపాల్లో పూజించడం ద్వారా అన్ని దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజు ఇంట్లో హనుమంతుడిని ఏ రూపంలో పూజించాలో, దాని వల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం.. 

Lord Hanuman Puja Tips: హనుమంతుని ఏ రూపాన్ని పూజిస్తే.. ఎటువంటి ఫలం లభిస్తుందో తెలుసా..
Lord Hanuman Puja
Follow us on

హిందూమతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది. వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుడికి అంకితం చేయబడింది. మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది. ఈ రోజున నిజమైన హృదయంతో బజరంగబలిని ఆరాధిస్తే.. తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు. కష్టాలన్నింటినీ తొలగిస్తాడు. కనుకనే రామ భక్తుడైన హనుమంతుడిని సంకట్ మోచనుడు అని కూడా పిలుస్తారు. హనుమంతుడిని అనేక రూపాల్లో పూజిస్తారు. ఈ పవనపుత్రుడిని భిన్న రూపాల్లో పూజించడం ద్వారా అన్ని దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం. ఈ రోజు ఇంట్లో హనుమంతుడిని ఏ రూపంలో పూజించాలో, దాని వల్ల కలిగే ఫలితం ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

పంచముఖి హనుమంతుడు
హనుమంతుని పంచముఖి రూపాన్ని పూజించే ఇంట్లో.. ఏర్పడే అన్ని అడ్డంకులు తొలగి, అభివృద్ధికి పురోగతి మార్గం తెరుచుకుంటుంది. ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నట్లు అనిపిస్తే.. అప్పుడు పంచముఖి హనుమాన్ బొమ్మని ఇంట్లో మంచిది. ఈ ఫోటోను అందరూ చూడగలిగే ప్రదేశంలో ఉంచండి. పంచముఖి హనుమంతుడి బొమ్మను ఉంచడం ద్వారా చెడు నీడ ఇంట్లోకి ప్రవేశించదు. పౌరాణిక నమ్మకం ప్రకారం.. హనుమంతుడు రావణుడి కుమారుడు అహిరావణుడిని చంపడానికి ఐదు ముఖాలతో పంచముఖి రూపాన్ని ధరించాడు.

వీర హనుమంతుడు
వీర హనుమంతుడిని ఆరాధించడం ద్వారా మనిషి శక్తి, బలం, ఆత్మవిశ్వాసాన్ని పొందుతాడు. వీర హనుమంతుడి బలాన్ని ఈ పేరు తెలియజేస్తుంది. ఈ స్వరూపాన్ని పూజించడం వల్ల పనుల్లో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

ఏకాదశి హనుమంతుడు
కల్కర్ముఖ్ అనే భయంకరమైన రాక్షసుడిని సంహరించమని శ్రీరాముడి ఆజ్ఞతో హనుమంతుడు ఏకాదశి రూపాన్ని ధరించాడు. శనివారం రోజున రాక్షసుడిని, అతని సైన్యాన్ని సంహరించాడు. ఈ రూపంలో ఉన్న హనుమంతుడిని పూజిస్తే.. అన్ని దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది.

దాసాంజనేయ 
హనుమంతుడి ఈ రూపం తరచుగా ఫొటోల్లో కనిపిస్తుంది. ఈ రూపంలో హనుమంతుడు ముకుళిత హస్తాలతో శ్రీరాముని పాదాల వద్ద కూర్చున్నట్లు కనిపిస్తాడు. ఇలాంటి విగ్రహాలు , ఫోటోలు తరచుగా ఇళ్లలో కనిపిస్తాయి.  ఈ రూపాన్ని ఆరాధించడం మనిషిలో అంకితభావం , సేవా స్ఫూర్తిని ప్రోత్సహిస్తుంది. ఆరాధకుడు  ఎల్లప్పుడూ విజయం సాధిస్తాడు.

హనుమంతుడు
శ్రీరాముని పూజించే సమయంలో హనుమంతుడి రూపాన్ని పూజించడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ చిత్రంలో అతని చేతిలో ఒక కర్తాల్ కనిపిస్తుంది. ఈ రూపంలో ఉన్న హనుమంతుడిని ఆరాధించడం ద్వారా జీవితంలోని ప్రతి లక్ష్యాన్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా సులభంగా సాధించవచ్చు.

సూర్యముఖి హనుమంతుడు
పురాణాల గ్రంధాలలో ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యభగవానుడు హనుమంతుడు గురువుగా పరిగణించబడ్డాడు. హనుమంతుడి సూర్య ముఖ రూపాన్ని పూజిస్తే, జ్ఞానం, జ్ఞానం, పురోగతి, గౌరవం లభిస్తుంది. సూర్యముఖి హనుమంతుడు.. తూర్పు ముఖంగా ఉన్న హనుమంతుడు అని కూడా అంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).