Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. మీరు ఈ నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? అయితే,మీరు ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..ఎందుకంటే..ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే విశేష పర్వదినాల జాబితాను టీటీడీ ప్రకటించింది.ఈ నెలలో సగం రోజులపాటు విశేష పర్వదినాలు ఉన్నాయి. టీటీడీ విడుదల చేసిన జాబితా ప్రకారం ఆగస్టు 8 నుంచి మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఆగస్టు 19న గోకులాష్టమి నిర్వహించనుండగా, ఆగస్టు 31న వినాయక చవితి పండుగ జరుపనున్నారు.
టీటీడీ ప్రకటించిన పర్వదినాలు..
– ఆగస్టు 1న శ్రీ ఆండాళ్ తిరువాడిపురం శాత్తుమొర. శ్రీవారు పురిశైవారితోటకు వేంచేపు చేస్తారు.
– మెజాన్ ఫెస్టివ్ ఆఫర్ | బెస్ట్ సెల్లింగ్ చీరలపై 80% వరకు తగ్గింపు
– ఆగస్టు 2న గరుడపంచమి, శ్రీవారి గరుడోత్సవం
– ఆగస్టు 6న శ్రీ తరిగొండ వెంగమాంబ వర్ధంతి
– ఆగస్టు 9న నారాయణగిరిలో ఛత్రస్థాపనం
– ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి పవిత్రోత్సవాలు
– ఆగస్టు 11న శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ, శ్రీ విఖనస మహాముని జయంతి
– ఆగస్టు 12న శ్రీ హయగ్రీవ జయంతి, శ్రీవారు విఖనసాచార్యులవారి సన్నిధికి వేంచేపు
– ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం
– ఆగస్టు 19న శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం
– ఆగస్టు 20న శ్రీవారి ఆలయం వద్ద ఉట్లోత్సవం
– ఆగస్టు 29న బలరామ జయంతి
– ఆగస్టు 30న వరాహ జయంతి
– ఆగస్టు 31న వినాయక చవితి
మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి