Diwali 2021: తమలపాకుతో అదృష్టం.. వ్యాపారంలో అభివృద్ధి.. ఎలాగంటే..?

Diwali 2021: దీపావళి రోజు ఇంట్లో ప్రతి ఒక్కరు లక్ష్మీ దేవి పూజ చేస్తారు. అంతేకాకుండా గణేశుడు, కుబేరుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. లక్ష్మదేవికి చంచల గుణం ఉంటుంది.

Diwali 2021: తమలపాకుతో అదృష్టం.. వ్యాపారంలో అభివృద్ధి.. ఎలాగంటే..?
Betel

Updated on: Nov 01, 2021 | 8:22 PM

Diwali 2021: దీపావళి రోజు ఇంట్లో ప్రతి ఒక్కరు లక్ష్మీ దేవి పూజ చేస్తారు. అంతేకాకుండా గణేశుడు, కుబేరుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. లక్ష్మదేవికి చంచల గుణం ఉంటుంది. అందుకే ఒక్కచోట నిలువదు. ఈ కారణంగానే ఇంట్లోకి సంపద వస్తుంది వెళుతుంది. లాభనష్టాలు ఉంటాయి. అయితే లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే మాత్రం దీపావళి రోజు ప్రత్యేక పూజ చేస్తారు. తమలపాకుతో లక్ష్మీదేవిని ఆరాదిస్తే జీవితంలో డబ్బుకు కొదవుండదని పండితులు చెబుతారు. లక్ష్మీదేవికి తమలపాకుతో పూజచేసి దానిని ఖజానాలో(డబ్బు, ధనం దాచే స్థలం) ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉంటుందని నమ్మకం. అంతేకాదు ఇది ఇంటికి శుభం కలిగిస్తుందని అంటారు. ఇలా చేయడం వల్ల ఏడాది పొడవునా డబ్బు వస్తుందని, నగదు పెట్టె ఎప్పుడు ఖాళీగా ఉండదని కొందరు విశ్విసిస్తారు.

వ్యాపారంలో లాభం కోసం తమలపాకు నివారణ
కరోనా కాలంలో మీ వ్యాపారం నష్టాలలోకి వెళ్లిపోతే తమలపాకుతో ప్రత్యేక పూజ చేస్తే మళ్లీ వ్యాపారం గాడిలో పడుతుందని పండితులు చెబుతున్నారు.శనివారం రాత్రి రావి చెట్టుకు పూజ చేసి తమలపాకులు, ఒక రూపాయి నాణెం ఉంచుకోవాలి. మరుసటి రోజు ఆ రావి చెట్టు నుంచి ఒక ఆకు తెచ్చి, దానిపై ఒక తమలపాకును ఉంచి, దానిని మీ డబ్బు దాచే స్థలంలో పెట్టాలి. ఈ పరిహారం చేసిన తర్వాత మీరు అద్భుత ప్రయోజనాలను పొందుతారు. అంతేకాదు వ్యాపారంలో పురోగతి ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్పారు.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

Viral Photos: ప్రపంచంలోనే వింతైనా 5 పువ్వులు.. వీటిని చూశారంటే ‘అద్భుతం’..

Diwali 2021: పండుగ సమయంలో గర్భిణులకు సూచన..! మధుమేహం ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త..

polluted cities: ప్రపంచంలోని టాప్‌ 5 కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఫస్ట్.. రెండో స్థానంలో లాహోర్‌..