నారవేప చెట్టు గురించి మీకు తెలుసా.. ఈ పవిత్ర వృక్షం ఆలయ ప్రాంగణంలో కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నదని తెలుసా..

దేవాలయాల ఎదు అంబరాన్ని అందుకునే విధంగా ట ఠీవిగా నిలబడి ధ్వజస్తంభాల విశిష్టత గురించి తెలిసిందే. అయితే వెండి, బంగారు, ఇత్తడి వంటి తొడుగులతో దర్శనం ఇచ్చే ఈ ధ్వజస్తంభాల తయారీకి ఎంచుకునే పవిత్ర వృక్షాల గురించి తెలుసా.. ఎండకు, వానకు పాడవ్వని వంకరటింకర లేని ముదురు నార వేప చెట్లతో ధ్వజస్తంభాలను తయారు చేస్తారు.

నారవేప చెట్టు గురించి మీకు తెలుసా.. ఈ పవిత్ర వృక్షం ఆలయ ప్రాంగణంలో కొలువుదీరి భక్తులతో పూజలను అందుకుంటున్నదని తెలుసా..
narepa tree

Edited By: Surya Kala

Updated on: May 16, 2025 | 1:25 PM

ఏలూరు: ఆలయం పవిత్రమైన స్ధలం. దేవుడు, దేవతలు నివశించే ప్రాంతం. హిందూ దేవాలయాల్లో ఎక్కువగా గాలిగోపురం, ధ్వజస్తంభం, గర్బగుడి, నైవేద్యం కోసం వంటశాల ఉంటాయి. దేవాలయాల నిర్వహణ ఆగమం ప్రకారం జరుగుతుంది. ఇక శివాలయం మైనా , వైష్ణవాలయం, రామాలయం, వెంకటేశ్వరాలయం ఇలా ఏ ఆలయంలో నైనా ధ్వజస్తంభం కు సైతం భక్తులు పూజలు చేస్తారు. పైకి ఇత్తడి, బంగారు తొడుగుల లోపల అంత ఎత్తులో అసలు ఏమి ఉంటుంది. ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలబడుతుంది.

పూర్వం అడవుల్లో, పొలాల్లో దారి తప్పినా వారికి ధ్వజస్తంభం దీపాల వెలుగు మార్గం చూపించేవి. దేహానికి ముఖం లా ఆలయ గర్భగుడి గురించి భావిస్తే ధ్వజస్తంభాన్ని హృదయంతో పోల్చుతారు. మూలవిరాట్టు ద్రృష్టి కోణానికి అనుగుణంగా ధ్వజస్తంభం ఉంటుంది. దీని కోసం బాగా చావగల మానులను ముందుగా ఎంచుకుంటారు. దీనికి కూడా బలిహరణలు, అర్చనలు జరుగుతాయి. ఇక ధ్వజస్తంభం కోసం వాడే వృక్షరాజాల్లో నారవేపకు మొదటి ప్రాధాన్యం ఉంటుంది.

ఈ నార వేప చెట్లు ఏలూరు జిల్లా కుక్కునూరు, వేలేరుపాడు అటవీ ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల నిర్మాణంలో ఎక్కువగా నారవేపను ఉపయోగిస్తున్నారు.‌ దీనికోసం ముందుగా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కావలసినంత వ్యాసార్థం, ఎత్తుతో పాటు చెట్టు లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకుంటారు. ఎంచుకున్న చెట్టుకు నరికే ముందుగా పూజలు చేస్తారు. ఈ చెట్ల అడవి నుంచి తరలించాలంటే పూర్తి స్ధాయిలో అటవీ అధికారులు అనుమతి తీసుకోవాలి. చెట్టు బెరడును తొలగించిన తర్వాత ఆలయం కు సంబంధించిన వ్యక్తులు అడవినుంచి వారి వారి ప్రాంతాలకు తరలిస్తారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..