Sabarimala: అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్.. ప్రసాదం విక్రయాలు బంద్.. కారణమదే..!

|

Jan 12, 2023 | 8:39 AM

అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి కోట్లాది మంది భక్తులు శబరిమల వస్తుంటారు. స్వామివారి దర్శనం అనంతరం పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని

Sabarimala: అయ్యప్ప భక్తులకు బ్యాడ్ న్యూస్.. ప్రసాదం విక్రయాలు బంద్.. కారణమదే..!
Ayyappa Prasadam
Follow us on

అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు దేశ నలు దిక్కుల నుంచి కోట్లాది మంది భక్తులు శబరిమల వస్తుంటారు. స్వామివారి దర్శనం అనంతరం పరమ పవిత్రంగా భావించే ప్రసాదాన్ని తీసుకుని తిరుగుపయనం అవుతారు. కానీ, ఇప్పుడు అయ్యప్ప భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. శబరిమల అయ్యప్ప స్వామి ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాద విక్రయాలను బంద్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రసాదం తయారీకి వాడిన యాలకుల్లో క్రిమి సంహారకాలు ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ స్టాండర్ట్ నివేదికలో వెల్లడైంది. ఈ విషయం కాస్తా హైకోర్టు వరకు వెళ్లింది.

నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం.. ప్రసాదం విక్రయాలు ఆపాలని ఆదేశించింది. దాంతో ట్రావెన్‌కోర్ ట్రస్ట్.. ప్రసాదం విక్రయాలను నిలిపివేసింది. అయితే, యాలకులు లేకుండా ప్రసాదాల తయారీకి అనుమంచింది హైకోర్టు. కాగా, కోర్టు ఆదేశాలతో నిన్న సాయంత్రం నుంచి విక్రయాలు ఆగిపోయాయి. కోర్టు ఆదేశాలతో దాదాపు 6.5 లక్షల ప్రసాదం డబ్బాల పంపిణీ నిలిచిపోయింది.

కాగా, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రసాదాల తయారీకి ఏర్పాట్లు చేశారు ఆలయ అధికారులు. మరోవైపు ప్రసాదం విక్రయాలు నిలిచిపోవడంతో భక్తులు ఉసూరుమంటున్నారు. అయ్యప్ప ప్రసాదం దొరక్కపోవడంతో కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..