AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Masam: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!

Karthika Masam Festivals Telugu: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తిక మాసం 2026లో నవంబర్ 10న ప్రారంభమై డిసెంబర్ 8న ముగియనుంది. ఈ పవిత్ర మాసంలో వచ్చే నాగుల చవితి, ప్రబోధన ఏకాదశి, కైశిక ద్వాదశి, కార్తిక పౌర్ణమి, మాస శివరాత్రి వంటి ముఖ్య పండుగలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Karthika Masam: కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు, పుణ్య తిథులు ఇవే!
Karthika Masam Festivals Telugu
Rajashekher G
|

Updated on: Nov 10, 2026 | 6:00 AM

Share

Karthika Masam Festivals Telugu: శివకేశవుల భక్తులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. తెలుగు పంచాంగం ప్రకారం ఎనిమిదో మాసమైన కార్తీకానికి సనాతన ధర్మంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. దీపారాధన, తులసీ పూజ, శివాభిషేకాలు, ఉపవాసాలు, దానధర్మాలతో ఈ మాసమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి రోజున చంద్రుడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి ‘కార్తీకం’ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసం శివారాధనతో పాటు శ్రీమహావిష్ణువు ఆరాధనకూ ఎంతో విశిష్టమైనది. 2026లో కార్తిక మాసం నవంబర్ 10, మంగళవారం ప్రారంభమై డిసెంబర్ 8, మంగళవారం అమావాస్యతో ముగియనుంది.

కార్తీక మాసంలోని ముఖ్య పండుగలు, పుణ్య తిథులు

  • నవంబర్ 10న కార్తీక శుద్ధ పాడ్యమి సందర్భంగా బలి పాడ్యమి, ఆకాశదీపారంభం జరుగుతాయి.
  • నవంబర్ 11న యమ ద్వితీయ, భగినీ హస్త భోజనం నిర్వహిస్తారు.
  • నవంబర్ 13న నాగుల చవితి సందర్భంగా నాగదేవతలను భక్తిశ్రద్ధలతో పూజిస్తారు.
  • నవంబర్ 15న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి అంకురార్పణ, తిరుమంగైయాళ్వార్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
  • నవంబర్ 16న కోటి సోమవారం
  • నవంబర్ 17న వృశ్చిక సంక్రమణం
  • నవంబర్ 19న యాజ్ఞవల్క జయంతి
  • నవంబర్ 20న ప్రబోధన ఏకాదశి
  • నవంబర్ 21న క్షీరాబ్ది ద్వాదశి.. కైశిక ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి వంటి విశేష పర్వదినాలు ఉన్నాయి. తిరుమలలో ఈ సందర్భంగా ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
  • నవంబర్ 22న పక్ష ప్రదోషం
  • నవంబర్ 24న కార్తిక పౌర్ణమి జరుపుకుంటారు. కార్తిక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం, కృత్తికా దీపోత్సవం వంటి విశేష కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటాయి.
  • నవంబర్ 27న సంకష్టహర చతుర్థి
  • డిసెంబర్ 4న కార్తీక బహుళ ఏకాదశి
  • డిసెంబర్ 6న పక్ష ప్రదోషం
  • డిసెంబర్ 7న మాస శివరాత్రి వస్తాయి.
  • చివరగా డిసెంబర్ 8న కార్తిక అమావాస్యతో పవిత్ర కార్తిక మాసం ముగుస్తుంది.

కార్తీక మాసంలో వీలైనంత వరకు ప్రతిరోజూ దీపారాధన చేయడం, తులసీ పూజ, శివాభిషేకం, విష్ణు ఆరాధన, ఉపవాసం, దానధర్మాలు చేయడం శ్రేయస్కరమని భక్తుల విశ్వాసం. ఈ పవిత్ర మాసంలో భక్తిశ్రద్ధలతో పూజలు, వ్రతాలు ఆచరించి శివకేశవుల అనుగ్రహం పొందుదాం.

ఇవి కూడా చదవండి

(Disclaimer: ఈ కథనంలో పేర్కొన్న పండుగలు, పుణ్య తిథులు, ఆధ్యాత్మిక విశేషాలు సంప్రదాయాలు, పంచాంగ వివరాలు, ధార్మిక విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. ప్రాంతం, పంచాంగం, ఆచార సంప్రదాయాలను బట్టి తేదీలు లేదా పూజా విధానాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ఇవి భక్తి, ఆధ్యాత్మిక అవగాహన కోసం మాత్రమే.)

Follow Us
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ మాసంలో వచ్చే పండుగలు..
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
రాశిఫలాలు: వారికి ఆదాయం డబుల్.. ఉద్యోగాల్లో కీలక మార్పులు!
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
హైదరాబాద్‌లో సదర్ సమ్మేళనంలో విషాదం.. దున్నపోతును ఆడిస్తూ..
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
వైట్‌హౌస్‌ వద్ద హైటెన్షన్.. ట్రంప్‌ ఉండగానే 2 భద్రతా ఉల్లంఘనలు
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
గోవర్ధన పర్వతం ఎందుకు కుంచించుకుపోతోంది? పులస్త్య మహర్షి శాపం..
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
దీపావళి కానుకగా లేఆఫ్ నోటీసు.. షాకైన ఉద్యోగి!
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
రోజూ ఉలవలు తింటే.. ఇమ్యూనిటీ డబుల్ .. గుర్రంలా పరుగులు తీస్తారు
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
దంతాలలో క్యావిటీస్ రావడానికి కారణం ఏంటో తెలుసా..? ఏ ఖనిజం లోపం
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
అర్జున్‌ను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. పొలిమేర 3 గ్లింప్స్ రిలీజ్
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!
ఉసిరికాయ ఎప్పుడు తినాలి? ఆరోగ్య ప్రయోజనాలు, తినే సరైన విధానం ఇదే!