Kanuma Celebrations Roja Home: సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఇంట వైభవంగా సంక్రాంతి సంబరాలు.. కనుమనాడు ఆవుని పూజించిన రోజా

తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు, ప్రజాప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా..

  • Surya Kala
  • Publish Date - 1:31 pm, Fri, 15 January 21
Kanuma Celebrations Roja Home: సినీ నటి, ఎమ్మెల్యే రోజా ఇంట వైభవంగా సంక్రాంతి సంబరాలు.. కనుమనాడు ఆవుని పూజించిన రోజా

Kanuma Celebrations Roja Home : తెలుగు లోగిళ్ళలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. సామాన్యులు, సెలబ్రెటీలు, ప్రజాప్రతినిధులు ఇలా ప్రతి ఒక్కరు సంక్రాంతి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. సినీ నటి, నగరి ఎమ్మెల్యే రోజా ఇంట సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. రోజా తన నివాసంలో కుటుంసభ్యుల మధ్య ఈ వేడుకలు జరుపుకున్నారు.
సంక్రాంతి పండుగల్లో మూడో రోజు కనుమ నాడు పశువులను పూజ చేయడం తెలుగువారి సంప్రదాయం.. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ రోజా కనుమ పండగ రోజున ఇంటికి ఆవును ఆహ్వానించారు. ఆ ఆవుకు పసుపు కుంకుమ అద్ది హారతి ఇచ్చి పూజలు చేశారు. ఈ వేడుకలో రోజా భర్త సెల్వమణి, కూతురు అన్షు మాలిక, కొడుకులు కూడా పాల్గొన్నారు. ఈ వేడుకకి సంబంధించిన ఫోటోలను రోజా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

Also Read: బోర్డర్ లో భద్రతాదళాలతో కలిసి పనిచేయడం జీవితంలో మరచిపోలేని మధురజ్ఞాపకం అంటున్న భళ్లాలదేవ