Monsoon Temple: రుతుపవనాల ఆగమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ

|

Jun 21, 2024 | 8:50 PM

ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. అంటే ఈ ఆలయం ఏ ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుందో అది కూడా ఓ ప్రత్యేక పద్ధతిలో అంచనా వేస్తుంది. అందుకనే ఈ ఆలయాన్ని మాన్‌సూన్ టెంపుల్ అని కూడా అంటారు. వర్షం లేదా రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఈ ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం ప్రారంభిస్తాయి.

Monsoon Temple: రుతుపవనాల ఆగమనాన్ని ఖచ్చితంగా అంచనా వేసే ఆలయం.. నేటికీ సైన్స్ చేధించని మిస్టరీ
Jagannath Monsoon Temple
Follow us on

భారత దేశం ఆధ్యాత్మికతకు నెలవు. మన దేశంలో అనేక ఆలయాలు, పుణ్య క్షేత్రాలు ఉన్నాయి. అలాంటి ఆధ్యాత్మిక ఆలయాల్లో నేటికీ సైన్స్ చేధించని మిస్టరీలున్నాయి. అలాంటి ఒకటి ఆలయాల్లో ఒకటి జగన్నాథ్ ఆలయం. ఇది ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న బెహతా గ్రామంలో ఉంది. ఈ దేవాలయం ప్రత్యేకత ఏమిటంటే వర్షాకాలాన్ని ముందుగానే అంచనా వేస్తుంది. అంటే ఈ ఆలయం ఏ ఏడాదిలో ఎంత వర్షం కురుస్తుందో అది కూడా ఓ ప్రత్యేక పద్ధతిలో అంచనా వేస్తుంది. అందుకనే ఈ ఆలయాన్ని మాన్‌సూన్ టెంపుల్ అని కూడా అంటారు. వర్షం లేదా రుతుపవనాల రాకకు కొన్ని రోజుల ముందు.. ఈ ఆలయ గర్భగుడి పైకప్పు నుంచి నీటి చుక్కలు కారడం ప్రారంభిస్తాయి.

ఇలా గర్భ గుడి పై కప్పు నుంచి జారుతున్న చుక్కలు వాన చినుకుల ఆకారంలో ఉండడం గొప్ప వింత. ఈ చుక్కల సైజును బట్టి ఆ ఏడాది రుతుపవనాలు బలంగా ఉండి ఎక్కువగా వర్షాలు కురుస్తాయో లేక బలహీనంగా ఉండి తక్కువ వర్షాలు కురవనున్నాయో అంచనా వేస్తారు.

జూన్ మొదటి పక్షం రోజుల్లో చుక్కలు పడటం ప్రారంభమవుతాయని దేవకాయ పూజారి కుధా ప్రసాద్ శుక్లా తెలిపారు. గోపురం మీద ఉన్న రాయి నుంచి మంచి పరిమాణంలో చుక్కలు పడుతున్నాయని.. ఈ చుక్కలు నాలుగైదు రోజుల క్రితం వరకు ఎక్కువగానే ఉన్నాయన్నారు.

ఇవి కూడా చదవండి

బండపై పడిన నీటి చుక్కలు ఆరిన వెంటనే వర్షం కురుస్తుంది. ఈ సంవత్సరం బండ పై పడిన నీటి చుక్కలు ఇంకా ఆరిపోలేదు. అయితే క్రమంగా నీటి చుక్కలు ఆరిపోవడం క్రమంగా జరుగుతోంది.. కనుక రుతుపవనాల రాకలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే చుక్కల పరిమాణం బట్టి ఈ సంవత్సరం మంచి రుతుపవనాలు రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయ రహస్యం తెలుసుకుని శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఆలయంలో దాదాపు 15 అడుగుల ఎత్తులో నల్లరాతితో చేసిన జగన్నాథుని విగ్రహం ప్రతిష్టించబడింది. దీనితో పాటు సుభద్ర, బలరామ విగ్రహాలు ఉన్నాయి. జగన్నాథుని విగ్రహం చుట్టూ 10 అవతారాల విగ్రహాలు ప్రతిష్టించబడ్డాయి.

ఈ ఆలయం లోపల, గర్భ గుడి చుట్టూ అందంగా చెక్కబడిన స్తంభాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఎన్నో సర్వేలు చేసినా ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో నేటికీ తెలియదు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.