హిందువులు ఎంతగానో ఎదురు చూసే అమర్ నాథ్ యాత్రకు సర్వం సిద్ధం అయింది. అమర్‌నాథ్ యాత్ర యాత్రికుల మొదటి బ్యాచ్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జమ్మూ బేస్ క్యాంపు నుండి జెండా ఊపి ప్రారంభించనున్నారు. అమర్‌నాథ్ యాత్రికుల మొదటి బ్యాచ్ ఈ రోజు (జూన్ 28వ తేదీ) జమ్మూ నుండి బహుళ భద్రతా ఎస్కార్ట్ మధ్య కాశ్మీర్‌లోని జంట బేస్ క్యాంపులకు బయలుదేరుతుంది. ఇక్కడ నుంచి ఈ ఏడాది అమర్ నాథ్ తీర్ధ యాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపధ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం రాత్రి జమ్మూలోని అమర్‌నాథ్ యాత్ర బేస్ క్యాంపును సందర్శించారు. తీర్థయాత్రకు సంబంధించిన తుది ఏర్పాట్లను సమీక్షించారు. జమ్మూలోని అమర్‌నాథ్ బేస్ క్యాంపులో గురువారం సాయంత్రం జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో యాత్రికులు నిర్వహించారు. విఘ్నలకధిపతి అయిన వినాయకుడిని భక్తితో పూజించారు. తమ యాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగాలని ఆ గణపతిని వేడుకున్నారు. బేస్ క్యాంప్ లో దేవదేవుడిని కీర్తిస్తూ పాటలతో ఆనందంతో చేసిన డ్యాన్స్ తో ఆనందభరితమైన వాతావరణం నెలకొంది.
అమర్నాథ్ యాత్ర కోసం అధికారులు చేసిన ఏర్పాట్లపై యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు యాత్రీకులు పహల్గామ్, బల్తాల్ క్యాంప్ లకు చేరుకుంటారు. రేపు (జూన్ 29న) పహల్గామ్ , బల్తాల్ నుండి అమర్నాథ్ తీర్ధ యాత్ర ప్రారంభం కానుంది. ఈ పవిత్ర యాత్రను వేలాది మంది యాత్రికులు చేపడతారని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ RR స్వైన్ , ఉన్నత సివిల్ సెక్యూరిటీ అధికారులతో కలిసి వచ్చిన Mr. సిన్హా, భగవతి నగర్‌లోని బేస్ క్యాంప్‌ను పరిశీలించారు. తుది ఏర్పాట్లను సమీక్షించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
లెఫ్టినెంట్ గవర్నర్ కూడా యాత్రికులతో సమావేశమై వారితో సంభాషించారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించి యాత్రికుల సౌకర్యార్థం చేపట్టిన చర్యలపై సమీక్షించినట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీను దృష్టిలో ఉంచుకుని అమర్ నాథ్ యాత్ర సాఫీగా సాగేందుకు చేపట్టిన విస్తృత ఏర్పాట్లను లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారులు వివరించారు.
#WATCH | J&K LG Manoj Sinha offers prayers before flagging off the first batch of Amarnath Yatra pilgrims from the Amarnath Yatra base camp in Jammu. pic.twitter.com/8n15XxTki1
— ANI (@ANI) June 28, 2024
యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగిన సిబ్బందిని మోహరించాలని సిన్హా ఆయా విభాగాలను ఆదేశించారు. సర్వీస్ ప్రొవైడర్లతో మాట్లాడిన లెఫ్టినెంట్ గవర్నర్ భక్తుల కోసం ఏర్పాటు చేసిన లాడ్జింగ్, ఆహారం, ఆరోగ్యం, రవాణా, RFID కౌంటర్లు, ఇతర సౌకర్యాలతో సహా సౌకర్యాలను గురించి అడిగి తెలుసుకున్నారు. 52 రోజులపాటు సాగనున్న అమర్ నాథ్ తీర్థయాత్ర జంట ట్రాక్‌ల నుండి ప్రారంభమవుతుంది. జూన్ 29 నుంచి ప్రారంభం కానున్న ఈ అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19న ముగుస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..