Hindu Tradition: పూర్వం గడపకు పసుపు, కుంకుమతో పూజ చేసి.. రోజులో పనిని మొదలు పెట్టేవారు ఎందుకంటే..

|

Mar 09, 2022 | 1:20 PM

Hindu Tradition: ఇప్పుడంటే గడపల్లేని ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ.. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ గడప లేని ఇల్లేలేదు.. గడపని శ్రీమహాలక్ష్మి(Sri maha lakshmi)గా భావించేవారు. పూర్వీకులు భూమికి.. ఆకాశానికి మధ్య..

Hindu Tradition: పూర్వం గడపకు పసుపు, కుంకుమతో పూజ చేసి.. రోజులో పనిని మొదలు పెట్టేవారు ఎందుకంటే..
Hindu Tradition
Follow us on

Hindu Tradition: ఇప్పుడంటే గడపల్లేని ఇల్లులు కనిపిస్తున్నాయి కానీ.. గత కొన్ని ఏళ్ల క్రితం వరకూ గడప లేని ఇల్లేలేదు.. గడపని శ్రీమహాలక్ష్మి(Sri maha lakshmi)గా భావించేవారు. పూర్వీకులు భూమికి.. ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించారు. హిరణ్యకశ్యపుడుని భూమికి … ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై నరసింహస్వామి సంహరించినట్లు పురాణాల కథనం. అందుకనే గడపని శ్రీమహాలక్ష్మిగా భావిస్తూ రోజూ గడపని శుభ్రం చేసి.. పసుపును రాసి.. కుంకుమ బొట్లు పెట్టేవారు. ఇది కొన్ని తరాల ముందు వరకూ మనం చూసిన పురాతన హిందూ ఆచారాలలో ఒకటి. హిందూ సంస్కృతిలో అత్యంత ముఖ్యమైన  సంప్రదాయంగా భావించేవారు. కానీ, ఆధునిక భావాల పేరుతో  ఈ రోజుల్లో గడప.. పసుపు అనేవి ఓ మూఢనమ్మకంగా పరిగణిస్తున్నారు. ఇంకొందరు.. గడపకు కలర్స్ వేసి.. మమ అనిపిస్తున్నారు.

గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే తాము రోజువారీ పనిని మొదలు పెట్టేవారు పూర్వీకులు.. గడపకు పూజ చేయకుండా ఇంట్లో ఏ శుభకార్యం గానీ, పూజా కార్యక్రమంగానీ మొదలు పెట్టేవారు కాదు. గడపను మహాలక్ష్మిగా భావించేవారు కనుకనే గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావిస్తుంటారు.

గడపకి పసుపు రాయడం వెనుక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే … రెండవది ప్రాణరక్షణ అని చెప్ప వచ్చు.. పసుపు వల్ల చాలా ఉపయోగాలున్నాయని ఆయుర్వేదం పేర్కొంది. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేని సహజ పదార్ధాలలో ఒకటి. పసుపు గడపకు రాయడానికి శాస్త్రీయ కారణం ఉంది. సాధారణంగా పల్లెటూళ్లు పంటపొలాల మధ్యలోనో,  అడవులకు సమీపంలోనో ఉంటూ వుంటాయి. ఈ కారణంగా ఇళ్లలోకి పాములు … తేళ్లు వంటి విష జంతువులు వస్తూ వుంటాయి. పసుపు ఘాటును భరించలేని ఇవి.. గడప దాటి ఇంట్లోకి రాలేవు కనుక గడపలకి పసుపు రాయడం ఆనవాయతీగా వచ్చిందని పెద్దలు చెబుతారు.

అంతేకాదు ఎవరికైనా శరీరానికి గాయం అయితే వెంటనే ఆ గాయంపై పసుపును అప్లై చేస్తారు. దీంతో హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించదు. ఇదే సూత్రం మన ఇళ్లకూ వర్తిస్తుంది. గడపకు పసుపును రాసినప్పుడు, ఇది హానికరమైన బ్యాక్టీరియా ఇంట్లో రావడాన్ని నిలిపివేస్తుంది. ఈగలు, దోమలు వంటి చిన్న కీటకాలు ఇళ్లలోకి ప్రవేశించవు. అంతేకాదు హానికరమైన అంటువ్యాధులను నుంచి నివారణ గా పనిచేస్తుంది.

Also Read:

ఈ 5 రాశుల వారు చాలా అజాగ్రత్తపరులు.. నిర్లక్ష్యంగా ఉంటారు.. అందులో మీరున్నారా తెలుసుకోండి