IRCTC Tirupati Tour: వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే IRCTC బెస్ట్ ప్యాకేజీ

|

Apr 25, 2024 | 9:19 PM

శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు ఈ గోవిందం టూర్ బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే వేసవిలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో తెలుగు వారి కోసం గోవిందం అనే టూర్ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి అందిస్తోంది. ఈ టూర్ లో తిరుమల తిరుపతి యాత్రను మూడు రోజులు పర్యటించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో రెండు రాత్రులు, మూడు పగళ్లు సాగనుంది.

IRCTC Tirupati Tour: వేసవిలో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నారా.. తక్కువ ధరకే IRCTC బెస్ట్ ప్యాకేజీ
Irctc Tirupati Package
Follow us on

వేసవి సెలవుల్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయాలనీ.. ఏదైనా ప్రదేశాలకు విహార యాత్రకు వెళ్లాలని కోరుకుంటారు. అయితే కొందరు వినోదం కోసం ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రాంతాలను దర్శించుకోవాలనుకుంటే.. మరికొందరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లాలను కోరుకుంటారు. శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు ఈ గోవిందం టూర్ బెస్ట్ ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే వేసవిలో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో తెలుగు వారి కోసం గోవిందం అనే టూర్ ప్యాకేజీని ఐఆర్‌సిటిసి అందిస్తోంది. ఈ టూర్ లో తిరుమల తిరుపతి యాత్రను మూడు రోజులు పర్యటించవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో రెండు రాత్రులు, మూడు పగళ్లు సాగనుంది. ఈ టూర్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి ఆలయం, గోవిందరాజ స్వామిని దర్శించుకోవచ్చు. అంతేకాదు ఈ టూర్ లో భాగంగా స్వామివారి స్పెషల్ దర్శనం టికెట్స్ ను అందిస్తోంది. ఈ గోవిందం టూర్ హైదరాబాద్‌ లోని లింగంపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి స్టార్ట్ మొదలై నల్గొండ మీదుగా తిరుపతికి చేరుకోవాల్సి ఉంటుంది.

గోవిందం టూర్ ఎలా సాగనున్నదంటే

టూర్ లో ఫస్ట్ డే: లింగంపల్లి రైల్వే స్టేషన్ ట్రైన్ సాయంత్రం 5:25 గంటలకు స్టార్ట్ అవుతుంది. సికింద్రాబాద్  రైల్వే స్టేషన్, నల్గొండ మీదుగా తిరుపతి క్షేత్రానికి ట్రైన్ ప్రయాణం సాగుతుంది. రాత్రి ప్రయాణం చేసి తిరుపతి కి రెండో రోజు ఉదయం చేరుకుంటారు.

సెకండ్ డే: ఉదయం 5:55 గంటలకు తిరుపతి చేరుకుంటారు. ఇక్కడ నుంచి ఐఆర్‌సీటీసీ బస్సులో త్రీ స్టార్ హోటల్ కు చేరుకుని ఫ్రెష్ అప్ అవ్వాల్సి ఉంటుంది. అనంతరం టిఫిన్ చేసి శ్రీ వారి దర్శనం కోసం బయలుదేరాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్పెషల్ దర్శనం చేసుకుని తిరిగి తిరుపతికి చేరుకుంటారు. అక్కడ హోటల్ లో లంచ్ చేస్తారు. మధ్యాహ్నం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నుంచి గోవిందరాజ స్వామి ఆలయానికి చేరుకొని అక్కడ గోవిందరాజ స్వామి దర్శించుకుని హోటల్ కు చేరుకుంటారు.

సెకండ్ డే రోజు సాయంత్రం హోటల్ కు చెక్ ఔట్ అయి తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకొని సాయంత్రం 6:25 గంటలకు తిరిగి హైదరాబాద్ కు బయలుదేరాల్సి ఉంటుంది.

మూడో రోజు ఉదయం: రాత్రి అంతా ప్రయాణించి మూడో రోజు ఉదయం 6:55 గంటలకు లింగంపల్లికి చేరుకుంటారు. దీంతో గోవిందం టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ టూర్ ధరలు

ఈ టూర్ ప్యాకేజీలో ఒకొక్కరికి ధర రూ. 3,800

5 ఏళ్ల లోపు పిల్లలకు ఈ ఉచితం

తీసుకుని వెళ్లాల్సినవి

ఈ టూర్ ని ఎంపిక చేసుకుని శ్రీవారి దర్శనం కోసం వెళ్లాలనుకునేవారు తప్పని సరిగా ఒరిజినల్ ఆధార్ కార్డుని తీసుకుని వెళ్లాల్సి ఉంది.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..