Ugadi Festival 2021: భారత దేశం అనేక మతాలు అనేక ఆచారాల నిలయం. ఇక్కడ జరుపుకునే కొన్ని పండుగలు సర్వమత సమ్మేళనానికి నిదర్శనాలు. ఉగాది కూడా అందులో ఒకటి. కడపలో ఉగాది వేడుక హిందూ-ముస్లింల సఖ్యతకు వేదిక. ఏళ్లుగా కడపలో ముస్లింలు తెలుగువారి తొలి ఏడాదిని ఘనంగా జరుపుకుంటున్నారు. వెంకన్న ఆలయానికి వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు. కడపలో అరుదైన ఉగాది సంగమం. హిందూ-ముస్లిం ఐక్యతకు నిదర్శనం. ఉగాది నాడు వెంకన్న సన్నిధిలో ముస్లిం భక్తుల సందడి. కడప లక్ష్మీ వెంకటేశ్వరుని ఆలయానికి వేకువజాము నుంచే ముస్లిం భక్తుల భారీ సంఖ్యలో చేరుకుంటారు. ఆరోజున స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి తమ మొక్కులు తీర్చుకుంటారు. అంతేకాదు
ఇక్కడ వెంకన్నకు ఉప్పు, పప్పు, చింతపండు సమర్పించడం ఆనవాయితిగా వస్తుంది. ముస్లింలు వెంకన్న ఆలయానికి రావడం వెనుక చారిత్రక నేపథ్యముంది. శ్రీవారు.. బీబీ నాంచారిని వివాహం చేసుకోవడంతో హిందూ-ముస్లింలకు బంధుత్వం ఏర్పడింది. అందుకే.. ముస్లింలు.. వేంకటేశ్వరస్వామిని అల్లునిగా భావిస్తారు . ఉగాది రోజు ప్రత్యేకంగా వెంకన్న ఆలయానికి వెళ్లి తమ అల్లునికి పండుగకి ఇంటికి ఆహ్వానిస్తూ మొక్కుకుంటారు. కడప ఆలయానికి చిత్తూరు, అనంతపురం జిల్లాల నుంచి కూడా భారీగా ముస్లింలు తరలివస్తారు. ఆరోజు ఆలయంలో ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరిస్తారు. ఉగాది రోజున హిందూ భక్తుల కంటే కూడా ముస్లిం భక్తులే ఎక్కువగా కనిపించడం ఈ ఆలయం ప్రత్యేకత.
ఈ పోస్టల్ పథకంలో నెలకు రూ.1500 పెట్టుబడి పెడితే.. రూ. 96,390 లభిస్తుంది.. ఎలా అంటే..!