Radha Krishna: వామ్మో! ఈ గుడిలో పొరపాటు చేస్తే.. రాధాకృష్ణుల శాపం వెంటాడుతుంది..!

మధుర మన కృష్ణుడు పుట్టిన చోటు. బృందావనం ఆయన రాసలీలలు, అల్లరి చేసిన పవిత్ర స్థలం. అలాగే ఇంద్రుడి కోపం నుండి ప్రజలను కాపాడటానికి ఆయన తన చిటికెన వేలిపై ఎత్తిన దైవ కొండ. శ్రీకృష్ణుడు జన్మించిన మధురతో మొదలయ్యే మన పవిత్ర యాత్ర, ఆయన ప్రేమ లీలలు చేసిన బృందావనం, అలాగే గోవర్ధన్ పర్వతాల దగ్గర పూర్తవుతుంది.

Radha Krishna: వామ్మో! ఈ గుడిలో పొరపాటు చేస్తే..  రాధాకృష్ణుల శాపం వెంటాడుతుంది..!
Govardhan Hill

Updated on: Dec 05, 2025 | 8:38 PM

పురాణాల ప్రకారం, గోవర్ధన మహారాజ్ అనే అతను గురువు ద్రోణాచార్యుడి కుమారుడు. ఒకప్పుడు అగస్త్య ముని అతన్ని కాశీకి తీసుకెళ్తుండగా, గోవర్ధన్ వెళ్లడానికి ఒప్పుకోలేదు. కోపం వచ్చిన ముని, గోవర్ధన్‌ను నెమ్మదిగా కుచించుకుపోయేలా శపించాడు. ఈ శాపం కారణంగానే ఆ కొండ ఇప్పటికీ కొద్దికొద్దిగా తగ్గిపోతోందని భక్తులు నమ్ముతారు.

హనుమంతుడి వాగ్దానం:

త్రేతా యుగంలో రామసేతు నిర్మాణానికి సహాయం చేయడానికి హనుమంతుడు ఈ కొండను తీసుకువెళుతుండగా, పని పూర్తవడం వల్ల దాన్ని మధ్యలోనే వదిలేశాడు. అప్పుడు, ద్వాపర యుగంలో శ్రీరాముడిని శ్రీకృష్ణుడు రూపంలో గోవర్ధన్ చూస్తాడని హనుమంతుడు వాగ్దానం చేశాడు. శ్రీకృష్ణుడు కొండను ఎత్తినప్పుడు ఆ వాగ్దానం నిజమై, గోవర్ధన్ శాశ్వతంగా పవిత్రమైంది. భక్తుల నమ్మకం ప్రకారం, గోవర్ధన్ కొండ మొత్తం శ్రీకృష్ణుడి రూపమే. అందుకే ఆ ప్రాంతంలో ఉండే ప్రతి మొక్క, తీగ కూడా దైవశక్తే.

పురాణాల్లో పైన చెప్పిన ఈ మూడు ప్రదేశాలకు హిందూ ధర్మంలో చాలా ప్రాముఖ్యత ఉంది. భక్తులు నమ్మేదేమంటే, గోవర్ధన్ కొండలో ఉన్న ప్రతి రాయి, ప్రతి చిన్న మట్టి రేణువు రాధాకృష్ణుల స్వరూపమే! అందుకే, ఈ గోవర్ధన కొండ నుండి మట్టి లేదా రాళ్లను మన ఇంటికి తీసుకురావడం అశుభం. ఇది దేవుడిని ఆయన ఆలయం నుండి బయటకు తీసుకువెళ్లినంత పెద్ద తప్పుగా భావిస్తారు. భక్తులు తమ కష్టాలు తీరాలని, ఆశీస్సులు పొందాలని ఇక్కడ 24 కిలోమీటర్ల (24-కోసుల) చుట్టూ ప్రదక్షిణ (పరిక్రమ) చేస్తారు.

గోవర్ధన మట్టి లేదా రాళ్లను ఇంటికి తీసుకురాకూడదు ఎందుకు?

చాలా మంది భక్తులు గోవర్ధన్ కొండ చుట్టూ తిరిగేటప్పుడు అక్కడి రాళ్లు లేదా మట్టిని గుర్తుగా ఇంటికి తెచ్చుకుంటారు. కానీ పాతకాలం నుండి వస్తున్న నమ్మకం ప్రకారం, ఇలా చేయడం చాలా ప్రమాదకరం.

ఈ విధంగా చేస్తే రాధా దేవికి, శ్రీకృష్ణుడికి కోపం వస్తుందని, దానివల్ల మన జీవితంలో సమస్యలు పెరగవచ్చని చెబుతారు. ఒకవేళ పొరపాటున తెచ్చుకుంటే, ఆ రాయి లేదా మట్టి బరువుకు సరిసమానమైన బంగారాన్ని ఆ దేవుడికి సమర్పించాలట అయితే ఇది ఈ రోజుల్లో ఎవరికీ సాధ్యమయ్యే పని కాదు.

బృందావనం నుండి మట్టి (బృందావన రజ్) తీసుకురావడం మాత్రం మంచిదే. ఆ మట్టిని నుదుటిపై తిలకంగా పెట్టుకుంటే మనశ్శాంతి, భగవంతుడిపై భక్తి పెరుగుతాయని నమ్ముతారు. కానీ గోవర్ధన్ కొండ నుండి మాత్రం మట్టి, రాళ్లు లేదా ధూళిని అసలు తీసుకురావద్దు.

గమనిక : ఈ కథనంలో ఇచ్చిన విషయాలు కేవలం నమ్మకాలు సంప్రదాయ జ్ఞానంపై ఆధారపడినవి. వీటిని పాటించే ముందు మీ గురువును లేదా సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.