Horoscope Today: వీరికి బాధ కలిగిస్తాయి.. వారికి సంతోషాన్ని ఇస్తాయి.. రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

|

Nov 30, 2022 | 6:41 AM

పలు రాశుల వారికి శుభఘడియలు నడుస్తున్నాయి. కీలక విషయాలు, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు. అనవసర విషయాలు, ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆయా రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే......

Horoscope Today: వీరికి బాధ కలిగిస్తాయి.. వారికి సంతోషాన్ని ఇస్తాయి.. రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us on

మేషం

సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మనోధైర్యమే శ్రీరామరక్ష. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లాభంలో చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృషభం

ఇవి కూడా చదవండి

పనుల్లో ఓర్పు చాలా అవసరం. బంధువులతో జాగ్రత్తగా ఉండాలి. శ్రమకు తగ్గ ఫలాలు ఉంటాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి, ఆందోళను అధిగమించేందుకు మరింత కృషి చేయాలి. కుటుంబ సభ్యుల మాటలకు విలువనివ్వాలి. రవి ధ్యాన శ్లోకం చదవడం ఉత్తమం.

మిథునం

శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. కీలక పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం లాభిస్తుంది. ఒక వార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. దుర్గా దేవిని ఆరాధించాలి.

కర్కాటకం

ఏకాగ్రతతతో పనిచేయాలి. విజయం మీదే. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో సంతోషాన్ని పంచుకుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సూర్యనారాయణమూర్తి ఆరాధన చేయాలి.

సింహం

కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉండాలి. సమాజంలో మీ విలువ పెరుగుతుంది. ఆర్ధికంగా మంచి ఫలితాలు వస్తాయి. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందుతారు.తో మేలు చేకూరుతుంది.

కన్య

గొప్ప ఫలితాలు అందుకుంటారు. ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించాలి. మానసిక ఆనందాన్ని కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. శ్రమాధిక్యం పెరగకుండా చూసుకోవాలి. మనసుకు నచ్చినవారితో సంతోషంగా గడుపుతారు. ఆనందాన్ని పంచుకుంటారు.

తుల

పనుల్లో ఆపదలు పెరగకుండా చూసుకోవాలి. ఆర్థికంగా పుంజుకుంటారు. సమస్యలు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగ,వ్యాపారా రంగాలవారు శుభవార్తలు వింటారు. సన్నిహితులు, స్నేహితుల నుంచి అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది.

వృశ్చికం

సర్దుకుపోయే మనస్తత్వం గొప్ప ఫలితాలు ఇస్తుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు బాగా పని చేస్తాయి. పనిలో మనోభీష్టం నెరవేరుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కీలక విషయాలు, ఆర్థిక వ్యవహారాల్లో మంచి ఫలితాలు పొందుతారు.

ధనస్సు

పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. చేపట్టిన పనుల్లో అనుకోని అవాంతరాలు. సమస్యలను పట్టుదలతో అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం మంచిది.

మకరం

భవిష్యత్తు ప్రణాళికలను రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి,ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనీయకండి. ఆంజనేయ ఆరాధన మంచి ఫలితాన్నిస్తుంది.

కుంభం

ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. శ్రమ ఫలిస్తుంది. పెద్దల ఆశీర్వచనాలు మేలు చేస్తాయి. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రారంభించిన పనులలో సానుకూల ఫలితాలు పొందుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. దుర్గాస్తుతి చదవాలి.

మీనం

అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. వీరికి శుభకాలం. కీలక నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టదేవతారాధన చేయాలి.

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి