Horoscope: ఈ రాశివారికి ఆశించిన స్థాయిలో ధనలాభం.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

| Edited By: Ravi Kiran

Dec 23, 2022 | 7:32 AM

ఆశించిన స్థాయిలో ధన లాభం ఉండకపోవచ్చు కానీ, విలాసాల మీద ఖర్చు మాత్రం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది..

Horoscope: ఈ రాశివారికి ఆశించిన స్థాయిలో ధనలాభం.. శుక్రవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us on
  • మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఈ రోజు మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర విషయాల మీద డబ్బు బాగా ఖర్చు చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరచుకోవడానికి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కుటుంబ జీవితానికి సమయం కేటాయిస్తారు. ఉద్యోగంలో మీకు ఒక శుభవార్త అందవచ్చు. స్నేహితులతో అపార్ధాలు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బంధువులను ఆదుకుంటారు.

  • వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆరోగ్యం చక్కగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన సమస్యలను జీవిత భాగస్వామితో పంచుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెంచే అవకాశం ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది.

  • మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఖర్చుదారీతనాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందిస్తుంది. స్నేహితులు, బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల వారికి ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళతారు. వ్యాపారం ప్రారంభించడానికి లేదా అందులో పెట్టుబడులు పెట్టడానికి ఇది సమయం కాదు.

  • కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆరోగ్యపరంగా ఈ రోజు మీకు చక్కని రోజు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కొన్ని అప్పులు తీరుస్తారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్త అందుతుంది. ఉద్యోగంలో కొత్త ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరటానికి అవకాశం ఉంది. శుభకార్యంలో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇరుగుపొరుగుతో విభేదాలకు అవకాశం ఉంది.

  • సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

సంకల్ప బలంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు దూరంగా ఉండండి. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది. కొందరు బంధువులు అపనిందలు వేసే సూచనలు ఉన్నాయి. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. మీకు డబ్బు ఇవ్వవలసిన వారు తీసుకువచ్చి ఇస్తారు. విలాసాల మీద డబ్బు ఖర్చు అవుతుంది.

  • కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఆర్థికంగా బాగానే ఉంటుంది. గట్టి పట్టుదలతో డబ్బు పొదుపు చేయడం ప్రారంభిస్తారు. ఓ భాగస్వామ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నిస్తారు. మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు తిరిగి ఇస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. స్నేహితులతో సరదాగా గడుపుతారు. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీకు విదేశాల నుంచి ఆఫర్ వచ్చే సూచనలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

  • తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అనుకోకుండా ఆర్థిక ప్రయోజనాలు మిమ్మల్ని వరిస్తాయి. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. మీ స్తోమత గురించి స్నేహితుల్లో ఒకరికి ఆర్థిక సహాయం చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఉన్నవారు కొద్దిగా లాభాలు గడిస్తారు. వృత్తి నిపుణులకు విదేశాల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇది చాలా మంచి సమయం. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.

  • వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

కొద్దిగా ఉద్యోగ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఎవరినీ నమ్మి డబ్బు బాధ్యతలు అప్పగించవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దూర ప్రాంతాల నుంచి శుభవార్త వింటారు. పిల్లల్లో ఒకరు చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లే సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. బంధు వర్గంలో మీ పలుకుబడి పెరుగుతుంది. ఇరుగుపొరుగు వారితో విభేదాలు తలెత్తవచ్చు. ఆరోగ్యం పర్వాలేదు.

  • ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. అధికార యోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి వ్యాపారాలు ప్రశాంతంగా సాగిపోతాయి. ఇల్లు గాని, స్థలంగాని కొనాలని ఆలోచిస్తారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.

  • మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆశించిన స్థాయిలో ధన లాభం ఉండకపోవచ్చు కానీ, విలాసాల మీద ఖర్చు మాత్రం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగానే ఉంటుంది. కుటుంబంలో సామరస్యం నెలకొంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. అనవసర పరిచయాలకు వీలైనంత దూరంగా ఉండండి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. స్నేహితురాలు ముఖం చాటేస్తుంది.

  • కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలోనూ, కుటుంబ పరంగాను బాగా కష్టపడటం జరుగుతుంది. శరీరానికి కాస్తంత విశ్రాంతి అవసరమని గుర్తుంచుకోండి. వృత్తి వ్యాపారాల్లో చక్కని లాభాలు కనిపిస్తున్నాయి. ప్రేమికురాలితో బిజీ అవుతారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. మంచి ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. అదనపు ఆదాయానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. పెళ్లి సంబంధానికి సంబంధించి శుభవార్త అందుతుంది.

  • మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

మితిమీరిన ఔదార్యం కారణంగా ఇబ్బంది పడతారు. స్తోమతకు మించి ఇతరులకు సహాయపడతారు. జీవిత భాగస్వామి తరఫు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం నిడకడగానే ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. వృత్తి నిపుణులకు విదేశాల నుంచి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో కొద్దిగా ఆటుపోటులు అనుభవానికి వస్తాయి.