Holi Bhai Dooj 2021: భాయ్ ధూజ్ పండగ అంటే దీపావళీ తర్వాత వచ్చే పండగ అని చాలా మందికి తెలుసు. అయితే హోలీ తర్వాత కూడా భాయ్ ధూజ్ పండగను జరుపుకుంటారు. హోలీ భాయ్ ధూజ్ హిందూ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన చైత్ర మాసానికి చెందిన కృష్ణ పక్షంలోని రెండవ తేదీన జరుపుకుంటారు.
హోలీ పండగను దేశవ్యాప్తంగా ఎంత ఘనంగా జరుపుకుంటారో తెలిసిన విషయమే. మార్చి 29న సోమవారం హోలీ జరుపుకున్నారు. ఇక ఆ తర్వాతి రోజు అయిన మార్చి 30న హోలీ భాయ్ ధూజ్ పండుగను కొన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటారు. రెండవ రోజు దీపావళి జరుపుకున్నట్లే, భాయ్ ధూజ్ పండుగలో అక్కచెల్లెలు తమ సోదరులకు దీర్ఘాయువుతో ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా హోలీ రెండవ రోజు అంటే హోలీ భాయ్ దూజ్ కూడా కొన్ని ప్రాంతాల్లో తమ సోదరులకు తిలకం పెట్టడం ఆనవాయితీ. తమ సోదరులు నిత్యం ఆనందంగా ఉండటమే కాకుండా.. ఆయురారోగ్యాలతో ఉండేందుకు ఇలా చేస్తుంటారు.
మార్చి 29 రాత్రి 8.54 గంటల నుంచి
మార్చి 30 సాయంత్రం 5.27 వరకు హోలీ భాయ్ ధూజ్ అమృత కాలం.
హోలీ భాయ్ ధూజ్ సమయం ఉదయం 6.41 గంటల నుంచి రాత్రి 8.6 వరకు
మార్చి 30న ద్విపుష్కర్ యోగా ఉదయం 6.2 నుంచి మధ్యాహ్నం 12.22 వరకు.
పురాణాల ప్రకారం.. ఒక నగరంలో ఒక మహిళకు కొడుకు, కూతురు ఉండేవారు. అయితే కొన్ని రోజులకు తన కూతురుకు వివాహం చేస్తుంది ఆ మహిళ. అయితే హోలీ తర్వాత రోజు ఆమె సోదరుడు.. తన సోదరి దగ్గరకు వెళ్ళి తనకు తిలకం పెట్టమని అభ్యర్థిస్తాడు. తన సోదరి దగ్గరకు వెళ్లే సమయంలో అతడు ఒక అడవి గుండా వెళ్తుంటాడు. ఆ సమయంలో అతనికి నది అడ్డంగా ఉంటుంది. దీంతో తన సోదరి దగ్గరకు వెళ్లేందుకు తనకు దారి ఇవ్వాలని ఆ నదిని అడుగుతాడు. అలా వెళ్తున్న సమయంలో అతనికి ఒక సింహం ఎదురవుతుంది. అప్పుడు కూడా అతను అదే మాట చెప్తాడు. తన సోదరి నుంచి తిలకం తీసుకున్న తర్వాత తనను బలి తీసుకోమని చెప్తాడు. వెంటనే ఆ సింహం వదిలేస్తుంది. ఇక ఆ తర్వాత అతనికి ఎదురుగా పాము వస్తుంది. దానితోనూ.. అదే మాట చెప్తాడు. వెంటనే ఆ పాము కూడా అతడిని వదిలేస్తుంది.
ఇక చివరకు తన సోదరి ఇంటికి వెళ్తాడు. తన సోదరుడికి తిలకం పెట్టిన ఆమె.. అతడు ఎందుకు అంతబాధగా ఉన్నాడో అని అడుగుతుంది. దీంతో తనకు జరిగిన విషయాలన్ని చెప్పుకోని బాధపడతాడు. వెంటనే ఆమె తన సోదరుడిని తీసుకోని చెరువు దగ్గర ఉన్న ఒక వృద్దురాలిని కలిసి.. తన సోదరుడికి వచ్చిన ఆపదను తొలగించమని కోరుతుంది. వెంటనే ఆమె.. మీ పూర్వ జన్మల ఫలితంగా ఇలా జరిగిందని.. అతడిని రక్షించాలంటే.. అతనికి వివాహం జరిపించాలని కోరుతుంది. ఇక ఆ తర్వాత వారిద్దరు కలిసి అదే అడవి గుండా.. తమ పుట్టింటికి బయలుదేరుతారు. ఆ సమయంలో ముందుగా వారికి ఎదురు వచ్చిన సింహానికి కాస్తా మాంసాన్ని ఉంచుతుంది. దీంతో అది వారిద్దరిని వదిలేస్తుంది. ఆ తర్వాత వారికి పాము ఎదురు వస్తుంది. అప్పుడు దానికి పాలను ఇస్తుంది ఆ సోదరి. ఇక ఆ తర్వాత నది దగ్గరకు వచ్చాక నదిని ఇద్దరు కలిసి దాటుతారు. ఇలా తన సోదరుడిని కాపాడుకుంటుంది.
Also read:
Happy Holi 2021: మన దేశంలో హోలీ పండుగను ఏఏ రాష్ట్రాల్లో ఏ పేర్లతో పిలుస్తారో తెలుసా..