Holi 2024: కాన్పూర్‌లో ఏడు రోజుల పాటు హోలీ.. 82 ఏళ్ల క్రితం మొదలైన గంగా మేళా గురించి మీకు తెలుసా..!

|

Mar 02, 2024 | 11:21 AM

మధురలోని హోలీ, బృందావనంలో పువ్వులతో తయారు చేసిన రంగులతో హోలీ, కాశిలో భస్మంతో ఆడే హోలీ ఇలా అనేక రకాల సాంప్రదాయ హోలీ కనువిందు చేస్తుంది. అయితే ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన హోలీ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. నిజానికి కాన్పూర్‌లో ఏడు రోజుల పాటు హోలీ ఆడతారు. కాన్పూర్‌లో ఏడు రోజులు హోలీలను ఎందుకు ఆడతారు.. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.

Holi 2024: కాన్పూర్‌లో ఏడు రోజుల పాటు హోలీ.. 82 ఏళ్ల క్రితం మొదలైన గంగా మేళా గురించి మీకు తెలుసా..!
Kanpur Holi Celebrations
Follow us on

హోలీ హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఆనందాన్ని, ఉత్సాహాన్ని తెచ్చే ఈ పండగ అంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికి ఇష్టమే. హోలీ రోజున ఇంట్లో, వీధిలో ఎక్కడ చూసినా చిన్నా పెద్దా అందరూ కలసి రంగులతో హోలీ ఆడుతూ కనిపిస్తారు. మన దేశంలోని అనేక నగరాలలో జరిగే హోలీ సంబరాలు ప్రపంచం వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. మధురలోని హోలీ, బృందావనంలో పువ్వులతో తయారు చేసిన రంగులతో హోలీ, కాశిలో భస్మంతో ఆడే హోలీ ఇలా అనేక రకాల సాంప్రదాయ హోలీ కనువిందు చేస్తుంది. అయితే ఇవే కాకుండా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కి చెందిన హోలీ కూడా ప్రజల్లో చర్చనీయాంశంగా మిగిలిపోయింది. నిజానికి కాన్పూర్‌లో ఏడు రోజుల పాటు హోలీ ఆడతారు. కాన్పూర్‌లో ఏడు రోజులు హోలీలను ఎందుకు ఆడతారు.. దీని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.

కథ విప్లవకారులకు సంబంధించినది

కాన్పూర్‌లో ఏడు రోజుల పాటు హోలీ జరుపుకోవడం ఇప్పటిది కాదు.. 82 సంవత్సరాల క్రితం అంటే 1942 సంవత్సరంలో హోలీని ఏడు రోజులు జరుపుకునే సంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి కాన్పూర్ నగరంలో ఏడు రోజుల పాటు హోలీని నిరంతరం జరుపుకుంటారు. కాన్పూర్‌లో హోలీ వేడుకలు రంగులు రంగ పంచమి రోజు నుండి ప్రారంభమవుతాయి. ప్రతి గ్రామం నుండి ప్రజలు గంగా నది ఒడ్డుకు తరలివస్తారు.. గంగా ఒడ్డున ఒకరినొకరు రంగులు వేసుకుంటూ సంతోషంగా హోలీని జరుపుకుంటారు. ఇలా కాన్పూర్ లోని హోలీ వేడుకల వెనుక ఒక చారిత్రక కథ ఉంది. ఈ వేడుకలకు పునాది 1942లో వ్యాపారుల స్వాతంత్ర్య ఉద్యమం ద్వారా వేయబడింది.

హోలీ రోజున భూస్వాముల అరెస్టు

గంగా మైలీ కథ స్వాతంత్ర్య ఉద్యమంలో విప్లవకారులకు సంబంధించినది. 1942కి ముందు దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే ఇక్కడ కూడా ఒకరోజు హోలీ ఆడేవారనీ, ఆ తర్వాత ఈ హోలీని ఇక్కడి ప్రజలు ఏడు రోజుల పాటు హోలీ ఆడడం ప్రారంభించారని ఇక్కడి ప్రజలు దీని వెనుక ఒక కథ ఉందని చెబుతారు. 1942లో బ్రిటీష్ ప్రభుత్వం హోలీ ఆడడాన్ని నిషేధించిందని.. వ్యాపారులపై పన్నులు పెంచిందని, దీనికి వ్యతిరేకంగా భూస్వాములు యుద్ధం ప్రారంభించారని చెబుతారు. బ్రిటిష్ కలెక్టర్ ఆ భూస్వాములను జైల్లో పెట్టాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్వాతంత్య్ర బాకా మ్రోగిస్తూ ఎక్కడికక్కడ నిరసనకు దిగారు.

ఇవి కూడా చదవండి

గంగా మేళా ఇలా మొదలైంది

భూస్వాముల అరెస్టు తర్వాత నగరంలో నిరసనలు ప్రారంభమయ్యాయి. నగరం మొత్తం హోలీ ఆడారు. ఆ భూస్వాములను విడిపించే వరకు నిరంతరం హోలీ ఆడతామని గ్రామస్తులకు ప్రకటించారు. నిరసనతో విసుగు చెందిన బ్రిటిష్ వారు చివరకు ఓడిపోయారు. వారి నిర్ణయాన్ని మార్చుకోవలసి వచ్చింది. భూస్వాములను జైలు నుండి విడుదల చేయడంతో పాటు, వారు పన్నును మాఫీ చేయవలసి వచ్చింది. ఈ ఆనందంలో గ్రామస్తులు ఇక్కడ రంగులు, గులాల్‌లతో హోలీ ఆడడం ప్రారంభించారు. ఆ భూస్వాములను బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేసిన రోజు అనురాధ నక్షత్రం.. దీని కారణంగా ఇప్పుటికీ ప్రతి సంవత్సరం అనూరాధ నక్షత్రం రోజున గంగా మేళా జరుపుకుంటారు. ఈ ఏడాది గంగా మేళా 83వ వార్షికోత్సవం జరగనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..