రోజురోజుకీ పెరుగుతున్న హనుమాన్ విగ్రహం.. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే.. శత్రుశేషం, గ్రహ బాధలు ఉండవని భక్తుల నమ్మకం

|

May 26, 2022 | 9:14 AM

నామక్కల్ లో నిలువెత్తు నిలువెత్తు రూపంలో ఆంజనేయస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 20అడుగుల విగ్రహంతో ఉంటుంది.

రోజురోజుకీ పెరుగుతున్న హనుమాన్ విగ్రహం.. ఇక్కడ స్వామివారిని దర్శిస్తే.. శత్రుశేషం, గ్రహ బాధలు ఉండవని భక్తుల నమ్మకం
Namakkal Temple In Tamilnad
Follow us on

Namakkal Anjaneyar Temple: రామభక్త హనుమాన్ ను హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆంజనేయస్వామి ఆలయం లేని ఊరు ఉండదు అంటే అతిశయోక్తికాదు. హనుమంతుడికి దేశంలో అనేక ప్రసిద్ధి చెందిన దేవాలయాలున్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి తమిళనాడు రాష్ట్రంలో నామక్కల్ ప్రదేశంలో ఉంది. ఈ ప్రాంతం అనేక చారిత్రాత్మక కట్టడాలకు నెలవు. వివరాల్లోకి వెళ్తే..

నామక్కల్ లో నిలువెత్తు రూపంలో ఆంజనేయస్వామి భక్తులతో పూజలను అందుకుంటున్నాడు.  ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం దాదాపు 20అడుగుల విగ్రహంతో ఉంటుంది. అంతేకాదు ఈ హనుమాన్ ప్రత్యేకత ఏమిటంటే.. స్వామి తనకు ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహ స్వామికి చేతులు జోడిస్తూ దాస్యభావాన్ని ప్రకటిస్తున్నాడు. అంతేకాదు ఈ ఆంజనేయ స్వామి గర్భగుడికి పైకప్పు లేదు. ఇలా పై కప్పు లేకపోవడానికి కూడా కారణం ఉందని.. అది చాలా ఆశ్ఛర్యకరంగా ఉంటుందని భక్తులు చెబుతుంటారు.

విగ్రహం.. స్థల విశిష్టత: 

ఇవి కూడా చదవండి

ఈ ఆలయంలోని హనుమాన్ విగ్రహం ఎత్తు రోజు రోజుకూ పెరుగుతోందని అంటారు. అంతేకాదు ఆంజనేయస్వామికి ఎదురుగా ఉన్న లక్ష్మీ నరసింహుని గర్భాలయానికి పైకప్పు లేదని.. అదే విధంగా రోజు రోజుకీ పెరుగుతున్న హనుమాన్ కు కూడా పై కప్పు లేదని అంటారు. అయితే గతంలో చాలామంది అనేక మార్లు.. ఆలయానికి పైకప్పు వేయాలని ప్రయాత్నాలు చేశారని.. అయితే వేసిన కప్పు వేసినట్టుగానే కూలిపోయాయని చెబుతున్నారు ప్రదాన అర్చకులు. ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం స్వయంభువు అయినందునే రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నారని.. అందువల్లే పైన కప్పు వేయడానికి వీలుకాలేదని ఓ కథనం. నిత్యం వేల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. నామక్కల్ హనుమాన్  కరుణ ఉంటే శత్రుశేషం, గ్రహ దోషం వంటి సమస్యలు ఉండవని భక్తుల నమ్మకం.

నామక్కల్ లోని దేవాలయం సుమారు 1500 ఏళ్ల నాటిది. నామక్కల్ కోట దిగువ భాగంలో ఈ గుడి ఉంది. నరసింహ స్వామి ఆలయానికి సుమారు వంద మీటర్లు ఎదురుగా ఉంటుంది హనుమాన్ గుడి. ఈ దేవాలయంలో ప్రధాన ఆకర్షణ ఆంజనేయ విగ్రహం. ఈ విగ్రహం చాలా ప్రసిద్ధి చెంది.. నమక్కల్ హనుమాన్‌గా పిలువబడుతుంది. ఆంజనేయుడు.. చేతులు జోడించి లక్ష్మీ నృసింహ స్వామి, సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉంటాడు. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి అభిముఖంగా ఉండటం విశేషం. ఆంజనేయుడి కన్ను లక్ష్మీ నరసింహ స్వామి పాద పద్మాలకు సరళ రేఖలో ఉంటుంది. ఆంజనేయుడి విగ్రహం ఇక్కడి కోటకు రక్షకునిగా ఉంటుందని… అక్కడి ప్రజలను శత్రువుల బారి నుండి రక్షిస్తుందని చెబుతుంటారు స్థానికులు. ఇక  ఆంజనేయ స్వామి పాదముద్రలు కమలాలం చెరువు మెట్ల మీద నేటికీ కనిపిస్తాయి.

కోట నిర్మాణం: నామగిరి కొండలపై ఉన్న నామక్కల్ కోటను 16వ శతాబ్ధంలో రామచంద్ర నాయకర్ నిర్మించారు. ఈ కోటలో ప్రస్తుతం పురాతనమైన విష్ణు ఆలయ శిథిలాలు కూడా ఉన్నాయి. నామక్కల్ దుర్గం కోట సుమారు ఒకటిన్నర ఎకరం వరకూ ఉంటుంది. ఈ కోటకు నైరుతి భాగంలో మొట్లు ఉన్నాయి. నామ గిరి హిల్స్ కు ఇరువైపులా ఉన్న గుహలో నరసింహస్వామి, రంగనాథ స్వామి ఆలయాలున్నాయి. కొండరాయితో మలచిన విగ్రహాలు కావటంతో అవి నేటికి  చెక్కు చెదరకుండా భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ కొండలలో ఎనిమిది కొలనులు ఉన్నాయి. వీటిలో తామర పువ్వులు  పెరుగుతాయి.

ఈ కోట బ్రిటిష్ వారి వశం: 

ఈ దుర్గంలో కొంత కాలం టిప్పు సుల్తాన్..  బ్రిటిష్ వారికి కనిపించకుండా తలదాచుకున్నాడనే కథనం కూడా వినిపిస్తుంది. కాలక్రమంలో ఈ కోటను బ్రిటిష్ వారు వశపరుచుకున్నారు. అయితే ఈ కోటలోని అద్భుతమైన శిల్పకళ సంపద మళ్లీ మళ్ళీ సందర్శించాలి అనే అనుభూతినిస్తాయి. హనుమంతుడి చల్లని దీవెనలు మనపై పడితే చాలు జీవితం సుఖసంతోషాలతో గడుస్తుందని భక్తుల నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి