Hanuman Temple: ప్రదక్షిణలతోనే భక్తులు కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడి గుడి ఎక్కడంటే.. ఈ ఆలయంలో విగ్రహం సహా ఎన్నో విశేషాలు..

|

Jul 21, 2022 | 10:57 AM

24 అడుగుల ఎత్తులో ఏకశిలావిగ్రహంపై కొలువైన అంజనీ పుత్రుడని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువైన చిన కాశి అయిన పొన్నూరు ఒక్కసారైన దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.

Hanuman Temple: ప్రదక్షిణలతోనే భక్తులు కోరిన కోర్కెలు తీర్చే హనుమంతుడి గుడి ఎక్కడంటే.. ఈ ఆలయంలో విగ్రహం సహా ఎన్నో విశేషాలు..
Ponnuru Hanuman
Follow us on

Ponnuru Hanuman Temple: రామభక్త హనుమంతుడికి గ్రామానికో గుడి ఉంటుందని అంటే అతిశయోక్తికాదు.. భారీ సంఖ్యలో భక్తులుంటారు. నమ్మి కొలిస్తే.. పిలిచే దైవముగా భావిస్తారు. హనుమంతుడి ఆలయాల్లో ఒకొక్క ఆలయం ఒకొక్క విశిష్టతను కలిగి ఉంటుంది. అలా ఒక గుడిలో పదకొండు ప్రదక్షణలు చేసి మనస్సులోని కోరికను పవన సుతుడికి నివేదిస్తే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కొలువైన 24 అడుగుల ఎత్తులో ఏకశిలావిగ్రహంపై కొలువైన అంజనీ పుత్రుడని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఐదున్నర ఎకరాల విస్తీర్ణంలో ఏడు ఆలయాలు కొలువైన చిన కాశి అయిన పొన్నూరు ఒక్కసారైన దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటున్నారు.

1940లో తయారు చేసిన ఏకశిలా విగ్రహాన్ని అత్యంత్య వ్యయ ప్రయాసల కోర్చి 1950 నాటికి 24 అడుగుల ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని పొన్నూరు తరలించారు. అయితే స్వామి వారిని ప్రతిష్టించేందుకు అవసరమైన ద్రవ్యం లేకపోవటంతో 1969 వరకూ స్వామి వారి విగ్రహాన్ని బల్లపైనే ఉంచారు. 1969లో జగన్నాధ స్వామి వారి అమృత హస్తాల మీదుగా స్వామి వారి ప్రతిష్ట జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకూ హనుమంతుణ్ని సేవించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. స్వామి వారి ముందు నిలబడి తిలకించాలంటూ తలపైకెత్తి చూడాల్సిందే.. మెట్ల మార్గం ద్వారా పైకెళ్లి స్వామి వారికి నిత్య పూజలు చేస్తుంటారు. ఆకు పూజ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మంగళ, శని, ఆది వారాల్లో ఈ ఆకు పూజ చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మక్కువ చూపుతుంటారు.

సీతమ్మ జాడ కోసం లంకకు వెళ్లిన హనుమంతుడు లంకంతా పరిశీలించి సీతమ్మ జాడ తెలుసుకుంటారు. అయితే రావణాసురుడు స్వామిని బంధించే ప్రయత్నం చేయగా లంకకే నిప్పు పెట్టి వస్తాడు. రాముడు వద్దకు వచ్చి సీత జాడను వివరిస్తాడు. అంతటా సంతోషించిన రాముడు ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుడిని తమలపాకులతో చేసిన దండను వేసి సత్కరిస్తాడు. ఆతర్వాతే ఆంజేయుడు ఆగ్రహం చల్లారిందని పురణాలు చెబుతున్నాయి. దీంతో స్వామివారికి ఆకు పూజ చేయిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

వీరాంజనేయ స్వామి వారి ఆయలంలోనే ఆరు ఉపాలయాలున్నాయి. సహస్రలింగేశ్వర స్వామి ఆలయం, కాలభైరవ గుడి, దశావతారల విష్ణుమూర్తి ఆలయం, స్వర్ణ వెంకటేవ్వర స్వామి దేవాలయంతో పాటు గరుత్మంతుని గుడి కూడా ఇక్కడ ఉంది. దీంతో శివ, కేశవల బేధం లేకుండా భక్తులు ఇక్కడకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

అదే విధంగా పదకొండు ప్రదక్షణలు చేసి తమ కోర్కెలను స్వామి వారికి విన్నవించుకుంటే ఆ కోరిక నెరవేరుతుందని భక్తులు భావిస్తారు. తమ కోరిన నెరవేరిన వెంటనే 108 ప్రదక్షణలు చేసి స్వామి వారిని సేవిస్తారు. అనేక పర్వ దినాలు ఇక్కడ పెద్ద ఎత్తున జరగుతాయి. స్వామి వారి ఆలయం పక్కనే అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూ ఉంటుంది. అనేక విశిష్టతులున్న స్వామి ఆలయ ప్రాంగణంలోనికి అడుగు పెట్టగానే మనస్సుకు ఎక్కడాలేని ప్రశాంతత వస్తుందని భక్తులు చెబుతున్నారు. భక్తుల కోరిన కోర్కెల తీర్చే పావన సుతుడిని దర్శించుకునేందుక వివిధ రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున తరలివస్తుంటారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..