ప్రపంచంలో ఏ ఆయుధం అత్యంత శక్తివంతం? నాటి బ్రహ్మాస్త్రం..? నేటి అణు బాంబు..? తెలుసుకోండి..

|

Oct 20, 2024 | 3:09 PM

హిందూమతం పురాతన మతాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాడని చెబుతారు. ఆ తర్వాత బ్రహ్మాస్త్రాన్ని సృష్టించాడు. నమ్మకాల ప్రకారం మానవులు ప్రపంచ నియమాలను అనుసరించడానికి, విషయాలు నియంత్రణలో ఉండటానికి బ్రహ్మ ఇలా చేసాడు. బ్రహ్మాస్త్రం సంధించడానికి మంత్రాలను ఉపయోగిస్తారు. దీని ప్రభావంతో నేటికీ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆయుధంగా పరిగణించబడుతుంది.

ప్రపంచంలో ఏ ఆయుధం అత్యంత శక్తివంతం? నాటి బ్రహ్మాస్త్రం..?  నేటి అణు బాంబు..? తెలుసుకోండి..
Hindu Epic Story
Follow us on

ఇప్పుడు అణ్వాయుధాలు ఎంత విధ్వంసకరం సృష్టిస్తాయో అంటూ ప్రపంచ దేశాలు భయపడుతూనే ఉన్నాయి. అణ్వాయుధం కంటే ప్రమాదకరమైన ఆయుధం లేదంటూ అత్యంత విధ్వంసకమైనవిగా పరిగణించబడుతున్నాయి. అయితే వీటికంటే అత్యంత శక్తివంతమైనదిగా పరిగణించబడే ఆయుధం ఒకటి ఉంది. అదే బ్రహ్మాస్త్రం. హిందూ మతం విశ్వాసాల ప్రకారం దీనిని బ్రహ్మ దేవుడు సృష్టించాడు. బ్రహ్మాస్త్రం సామర్థ్యం వర్ణించలేనిది అని.. ఒక్కసారి బ్రహ్మాస్త్రం సంధిస్తే ప్రత్యర్థి పూర్తిగా దాసోహం అనాల్సిందే అని అంటారు. బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి మార్గం లేదని నమ్ముతారు. దీనిని బ్రహ్మాస్త్రం బ్రహ్మాశీర్ష అస్త్రం, బ్రహ్మాండ అస్త్రం, భార్గవాస్త్రం అని కూడా అంటారు. ఈ రోజు అతీంద్రియ శక్తి గల ఆయుధానికి సంబంధించిన విశేషాలను గురించి తెలుసుకుందాం..

ఎవరు తయారు చేసారు?

బ్రహ్మాస్త్రాన్ని ఒకసారి విడిచి పెడితే అది తన లక్ష్యాన్ని నాశనం చేసిన తర్వాత మాత్రమే సాధకుడి దగ్గరకు చేరుకుంటుంది. ప్రపంచంలో ఒక్కటి మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఓడించగలదని అంటారు. ఎవరైనా బ్రహ్మాస్త్రం నుండి తప్పించుకోవాలనుకుంటే మరొక వైపు నుంచి కూడా బ్రహ్మాస్త్రంతో దాడి చేయాలి. అప్పుడే అది నాశనం అవుతుంది.

బ్రహ్మాస్త్రాన్ని ఎవరు సంధించగలరంటే

ప్రతి వ్యక్తి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించలేరని.. దీని శక్తిని తట్టుకోవడం చాలా కష్టమని అంటారు. పురాణాల ప్రకారం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన వారు లేదా దీనిని ప్రయోగించే జ్ఞానం ఉన్నవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇప్పటి వరకు మహాభారత కాలంలో శ్రీ కృష్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కర్ణుడు, యుధిష్ఠిరుడికి మాత్రమే ఈ అస్త్రాన్ని ఎలా నిర్వహించాలో తెలుసు. రామాయణ కాలంలో ఈ బ్రహ్మాస్త్రాన్ని రావణుడు తనయుడు మేఘనాథుడు, లక్షణుడు మాత్రమే ప్రయోగించే శక్తి ఉన్నవారు.

ఇవి కూడా చదవండి

కృష్ణుడు ఎప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడంటే

శ్రీ కృష్ణుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. దీని వెనుక కూడా ఓ కథ ఉంది. పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో గెలిచిన తర్వాత పాండవుల గురువు ద్రోణాచార్యుడి కుమారుడు అశ్వత్థామ విధ్వంసం సృష్టించడం ప్రారంభించాడు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి పాండవులు అనుకుని ద్రౌపతి ఐదుగురు కుమారులను అంటే ఉప పాండవులను హత్య చేశాడు. అయినప్పటికీ అతని కోపం చల్లారలేదు. తమ కుమారుల మరణం విషయం తెలుసుకున్న పాండవులు కూడా అశ్వత్థామ వెంట పరుగెత్తారు. అప్పుడు అశ్వత్థాముడు పాండవుల వైపు బ్రహ్మాస్త్రాన్ని వదిలాడు.

ఆ సమయంలో శ్రీకృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. పాండవులను రక్షించేందుకు ఆ బ్రహ్మాస్త్రాన్ని అశ్వత్థామ వైపుకి మళ్ళించాడు. ఇది గమనించిన అశ్వత్థామ తన వైపు వస్తున్న బ్రహ్మాస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు తిప్పాడు. ఉత్తర గర్భంలో పరీక్షిత్తు పెరుగుతున్నాడు. అది చూసిన శ్రీ కృష్ణుడు సూక్ష్మ రూపం దాల్చి ఉత్తర గర్భంలోని పరీక్షిత్తును ఆ బ్రహాస్త్రం నుంచి రక్షించాడు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)