Vinayaka Chavithi: తెలుగు రాష్ట్రాల్లో భారీ బొజ్జగణపయ్యకు పొంచి ఉన్న ప్రమాదం.. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని ఆందోళన

|

Sep 10, 2022 | 4:14 PM

కొన్ని ప్రాంతాల్లోని మండపాల్లో బొజ్జ గణపయ్య ఇంకా భక్తులతో పూజలను అందుకుంటూనే ఉన్నాడు.. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన విగ్రహానికి ముంపు పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది

Vinayaka Chavithi: తెలుగు రాష్ట్రాల్లో భారీ బొజ్జగణపయ్యకు పొంచి ఉన్న ప్రమాదం.. ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందని ఆందోళన
Clay Ganesh Idol In Visakha
Follow us on

Vinayaka Chavithi: తెలుగు రాష్ట్రాలతో సహా దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు భక్తులతో పూజలను అందుకున్న బుజ్జి గణపయ్య గంగమ్మ ఒడిని చేరుకుంటున్నారు. అనేక ప్రాంతాల్లో గణపతి విగ్రహాల నిమజ్జనోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగుతోంది. అయితే కొన్ని ప్రాంతాల్లోని మండపాల్లో బొజ్జ గణపయ్య ఇంకా భక్తులతో పూజలను అందుకుంటూనే ఉన్నాడు.. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన అత్యంత ఎత్తైన విగ్రహానికి ముంపు పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతుంది. వివరాల్లోకి వెళ్తే..

విశాఖ పట్నంలో ఈ ఏడాది అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఎత్తైన 89 అడుగుల విగ్రహాన్ని ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసింది. గత 10 రోజులుగా భక్తులతో పూజలను అందుకుంటున్న ఈ గణపతి విగ్రహం కూలిపోతుందేమో అని పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎడమ వైపుకు ఒక అడుగు మేర వరిగిపోయినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు విగ్రహ భద్రత విషయంలో తనిఖీలు చేయమంటూ అర్ అండ్ బి అధికారులను కోరారు.  అధికారులు తనిఖీలు చేసి.. విగ్రహం కూలిపోయే ప్రమాదం అధికంగా ఉందని నివేదికని ఇచ్చారు. దీంతో విగ్రహాన్ని వెంటనే నిమజ్జనం చేయాల్సిందిగా పోలీసులు సూచించారు. అయితే 18 వ తేదీన గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలని ఉత్సవకమిటీ నిర్ణయించింది. పోలీసులు సూచించినట్లు ముందస్తు నిమజ్జనానికి అంగీకరించలేదు.

రోజూ వేలాదిమంది గణపతి ప్రతిమను దర్శనం చేసుకుంటున్న నేపథ్యంలో ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నట్టు పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణం అయినా భక్తులకు ఇబ్బంది కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు .. ఇక నుంచి గణపతి మండపానికి వచ్చే భక్తులను
100 మీటర్ల లోపు ఎవ్వరినీ అనుమతించ వద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..