Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణం… భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన ముఖ్యమంత్రి..

|

Feb 02, 2021 | 5:17 AM

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా చేపట్టిన విరాళాల కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది.

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణం... భారీ మొత్తంలో విరాళం ప్రకటించిన ముఖ్యమంత్రి..
Follow us on

Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా చేపట్టిన విరాళాల కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు మొదలు.. సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖలు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల వారు తమకు తోచినంత విరాళాలు అందిస్తున్నారు. తాజాగా హర్యానా ముఖ్యమంత్రి ఎంఎల్ ఖట్టర్ అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీ విరాళం ప్రకటించారు.

రామాలయం కోసం తాను రూ. 5,10,000 విరాళం ఇస్తున్నానని తెలిపారు. ఈ విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధికి అందజేశారు. అయితే, ట్రస్ట్ ప్రతినిధి ముఖ్యమంత్రికి రామమందిరానికి సంబంధించిన చిత్రపటాన్ని జ్ఞపిక అందజేశారు. అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు సేకరించే కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ విరాళాల సేకరణ కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ వరకు కొనసాగనుంది.

Also read:

Six Times Winner: ఇతన్ని అదృష్టానికి అంబాసిడర్ అనేలేమో.. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా..

Shanker: ఆ వార్త విని షాక్‌కు గురయ్యాను.. అరెస్ట్‌ వారెంట్‌పై స్పందించిన దర్శకుడు శంకర్‌..