Shanker: ఆ వార్త విని షాక్‌కు గురయ్యాను.. అరెస్ట్‌ వారెంట్‌పై స్పందించిన దర్శకుడు శంకర్‌..

Director Shanker About Arrest Warrent: తమిళ దర్శకుడు శంకర్‌కు ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్ట్‌ షాకిచ్చిందని, ఏకంగా పీటీ వారెంట్‌ జారీ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఈ వార్తలపై...

Shanker: ఆ వార్త విని షాక్‌కు గురయ్యాను.. అరెస్ట్‌ వారెంట్‌పై స్పందించిన దర్శకుడు శంకర్‌..
Follow us

|

Updated on: Feb 02, 2021 | 5:10 AM

Director Shanker About Arrest Warrent: తమిళ దర్శకుడు శంకర్‌కు ఎగ్మోర్‌లోని మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్ట్‌ షాకిచ్చిందని, ఏకంగా పీటీ వారెంట్‌ జారీ చేసిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి ఈ వార్తలపై దర్శకుడు శంకర్‌ అధికారికంగా స్పందించాడు. తనపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయ్యిందని తెలిసి షాక్‌కు గురయ్యానని చెప్పుకొచ్చాడు. అయితే ఈ విషయమై తన లాయర్‌ సాయి కుమరన్‌ కోర్టును సంప్రదించగా అసలు విషయం తెలిసిందని పేర్కొన్నాడు. తనపై ఎలాంటి వారెంట్‌ లేదని.. ఆన్ లైన్ కోర్ట్ రిపోర్టింగ్‌లో లోపం కారణంగా ఇలా జరిగిందని తెలిసి ఊపిరి పీల్చుకున్నానని శంకర్‌ స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశాడు. ఆన్‌లైన్‌లో జరిగిన పొరపాటను సరి చేశారని తెలిపాడు. ఈ విషయమై మీడియా ఎలాంటి అవాస్తవాలను ప్రచారం చేయవద్దని శంకర్‌ విజ్ఞప్తి చేశడు. ఇదిలా ఉంటే.. ఏంథిరన్ ( రోబో ) చిత్ర కథ తనదేనని గతంలో ఆరూర్ తమిళ్‌నాథన్ అనే వ్యక్తి కోర్టుని ఆశ్రయించాడు. తన కథను ‘జిగుబా’ పేరుతో 1996 సంవత్సరంలో మొదటిసారి తమిళ పత్రికలో ప్రచురించానని, మరోసారి 2007 లో ‘ధిక్ ధీక్ దీపికా దీపికా’ అనే నవలగా తిరిగి ప్రచురితమైందని చెప్పాడు. దాని ఆధారంగానే శంకర్ రోబో కథను తీసుకున్నారని కోర్టుకు విన్నవించాడు. ఈ క్రమంలోనే శంకర్‌కు కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసిందని వార్తలు వచ్చాయి.

Also Read: Republic Movie Update: సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ మూవీ థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడో చెప్పేసిన చిత్రయూనిట్..