Hanuman Jayanti: కష్టాలు తీరడానికి, కోరికలు నెరవేరడానికి హనుమాన్ జయంతి రోజున ఇలా పూజ చేసి చూడండి..

|

Apr 02, 2023 | 12:23 PM

ఈ ఏడాది 06 ఏప్రిల్ 2023, గురువారం హనుమాన్ జయంతి వచ్చింది. ఈ రోజున వాయు పుత్రుడు హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల కష్టాలు తీరిపోవడమే కాదు.. పనులు కూడా త్వరగా పూర్తవుతాయి.

Hanuman Jayanti: కష్టాలు తీరడానికి, కోరికలు నెరవేరడానికి హనుమాన్ జయంతి రోజున ఇలా పూజ చేసి చూడండి..
Hanuman Jayanti
Follow us on

రామ నామ స్మరణతోనే అంతులేని బలాన్ని పొందే ధీరుడు హనుమంతుడి జయంతిని ఏడాదిలో మూడుసార్లు జరుపుకుంటారు. ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి జరుపుకోగా.. మరికొందరు వైశాఖమాసం దశమి రోజున.. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమన్ జయంతిని జరుపుకుంటారు. ఈ ఏడాది 06 ఏప్రిల్ 2023, గురువారం హనుమాన్ జయంతి వచ్చింది. ఈ రోజున వాయు పుత్రుడు హనుమంతుడిని పూజించడం వల్ల భక్తుల కష్టాలు తీరిపోవడమే కాదు.. పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి.

హనుమాన్ జయంతి రోజున పూజ చేయడమే కాదు.. కొన్ని ప్రత్యేక చర్యలు చేయడం ద్వారా..  పవనసుతుడు త్వరగా సంతోషిస్తాడని నమ్మకం. అంతేకాదు.. ఏవైనా కోరికలు ఉంటే.. పూర్తి నియమాలతో హనుమంతుడిని పూజించండి. ఇలా చేయడం వల్ల చేపట్టిన పనులు త్వరగా పూర్తి అవుతాయని విశ్వాసం. హనుమంతుడిని పూజించడానికి కొన్ని మార్గాల గురించి తెలుసుకుందాం.

హనుమంతుడి పూజకు సంబంధించిన పరిహారాలు: 

ఇవి కూడా చదవండి
  1. సనాతన మత విశ్వాసాల ప్రకారం.. హనుమంతుడి జయంతి రోజున హనుమాన్ చాలీసా పఠించడం శుభప్రదమని భావిస్తారు. అంతేకాదు సుందర కాండ, హనుమాన్ అష్టకం, హనుమాన్ చాలీసా ను పఠించడం శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. దీంతో ఇంట్లో ఆనందం, శాంతి కూడా నెలకొంటుంది.
  2. ఆంజనేయుడికి సింధూరం చాలా ఇష్టమని నమ్ముతారు. హనుమాన్ జయంతి రోజున సింధూరం రంగు దుస్తులను హనుమంతుడికి  సమర్పించండి. ఈ విధంగా చేస్తే.. హనుమంతుడు ప్రసన్నుడవుతాడని.. భక్తులకు విశేషమైన అనుగ్రహాలను ప్రసాదిస్తాడని విశ్వాసం.
  3. హనుమంతుని ఆలయానికి వెళ్లి ఆయనను దర్శించుకుని అక్కడ నెయ్యి లేదా నూనె దీపం వెలిగించండి. అంతేకాదు హనుమాన్ చాలీసా 11 లేదా 23 సార్లు పఠించండి.
  4. హనుమంతుడి జయంతి రోజున దేవాలయానికి వెళ్లి.. మీ కుడి చేతి బొటన వేలితో సింధూరం తీసుకుని సీతాదేవి పాదాల వద్ద రాయండి. ఇలా చేయడం వల్ల మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుందని..  అనుకున్న పనులు నెరవేరతాయని విశ్వాసం.

హనుమాన్ పూజకు అనుకూలమైన సమయం

పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి తేదీ 06 ఏప్రిల్ 2023 న వచ్చింది. భజరంగి భలి పుట్టినరోజు చైత్ర మాసం పౌర్ణమి తేదీ అక్టోబర్ 05, 2023 ఉదయం 09.19 నుండి ప్రారంభమై ఏప్రిల్ 06, 2023 వరకు ఉదయం 10.04 గంటలకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో.. ఉదయ తిథిని ప్రాతిపదికగా పరిగణించి ఏప్రిల్ 06, 2023న హనుమాన్ జయంతిని జరుపుకుంటారు.

మరిన్ని ఆధాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)