ప్రతి వ్యక్తి జీవితాన్ని సంతోషంగా జీవించడానికి, విజయాన్ని పొందడానికి తన స్థాయిలో చాలా ప్రయత్నాలు చేస్తాడు. విజయం కోసం ఎంత కష్టపడి అయినా పని చేస్తాడు. అయితే కానీ కొన్నిసార్లు అతను చాలా సులభంగా సక్సెస్ అందుకుంటే.. కొంతమంది.. ఎన్నిసార్లు ప్రయత్నాలు చేసినా శ్రమకు తగిన విజయాన్ని పొందలేడు. ఇలాంటి పరిస్థితుల్లో విఫలమైన వ్యక్తి తన అదృష్టాన్ని తరచుగా తిట్టుకుంటాడు. అవును అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. ఒక వ్యక్తి తన ఊహకు మించి జరిగే నమ్మలేని నిజం మంచి జరిగితే అదృష్టంగా భావిస్తారు. అదేవిధంగా చెడు జరిగితే దురదృష్టం అంటారు. అయితే నిజం ఏమిటంటే అదృష్టంపై ఆధారపడి ఏమీ జరగదు. గతాన్ని మరచి.. భవిష్యత్ దృష్టి పెట్టి.. యువత జీవితాన్ని సాగించాలని.. ఎందుకంటే అందమైన శాశ్వతమైన భవిష్యత్తు మీ ముందు ఉంది అని స్వామి వివేకానంద చెప్పారు. ప్రతి మాట, ఆలోచన, పని మీ భవిష్యత్ ను నిర్ణయిస్తుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఓ వ్యక్తి ఈ రోజు చేసిన కర్మ రేపటి విధిగా మారుతుంది. జీవితంలో కర్మతో ముడిపడి ఉన్న అదృష్టం నిజమైన అర్థాన్నిఇస్తుంది. ఈరోజు అదృష్టానికి సంబంధించిన 5 విలువైన విషయాలను తెలుసుకుందాం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)