అసూయ ఏ కాలంలోనైనా మనిషి జీవితంపై అత్యంత ప్రభావాన్ని చూపిస్తుంది. జీవితంలో అభివృద్ధి బాటలో పయనించడానికి ఆటంకంగా మారుతుంది. అవును ఎవరైనా తమ కంటే ఆనందంగా, విజయ పథంలో పయనిస్తున్న.. అభివృద్ధి చెందుతున్నా కొంతమంది తమకు తెలియకుండానే అవతలి వ్యక్తిమీద అసూయ పడడం ప్రారంభిస్తారు. అయితే ఈ అసూయ మనిషిలో ప్రతికూల లక్షణంగా పరిగణించబడుతుంది. అంతేకాదు.. ఆ వ్యక్తి ప్రతికూల ఆలోచన, అతని బలహీనత, అభద్రత భావానికి సంకేతం. కొన్నిసార్లు మీరు ఈ అసూయను ఇతరులలో చూడవచ్చు, కొన్నిసార్లు ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో మీలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. ఒక వ్యక్తిని చూస్తే అతని గురించి తక్కువ భావన, లేదా అత్యధికంగా ఆలోచించడం మొదలు పెడతాడు. అంతేకాదు అసూయ జీవితంలోని అన్ని దుఃఖాలకు అతి పెద్ద కారణమని మహనీయులు పేర్కొన్నారు. అసూయ వ్యక్తి జీవితంలోకి ప్రవేశిస్తే.. మొదట ఆ వ్యక్తి తనకు తాను హాని చేసుకుంటాడు. ఈరోజు అసూయ వలన కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)