Tirumala Temple: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచున్నట్లు వెల్లడించింది. రోజుకు 8 వేల టోకెన్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను పెంచడంతో పాటూ దర్శన సమయంను పెంచింది టీటీడీ. నేటి నుంచి రాత్రి 12 గంటలకు స్వామివారికి ఏకాంతసేవ నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాత్రి 12 గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. కరోనా కారణంగా గతేడాది లాక్ డౌన్ నుండి రాత్రి 9 గంటలకే ఏకాంత సేవ నిర్వహించి ఆలయాన్ని మూసివేస్తూ వస్తున్నారు టీటీడీ అధికారులు. అంతేకాదు.. ఇప్పటి వరకు చిత్తూరు వాసులకు మాత్రమే పరిమితం చేసిన సర్వదర్శనం టికెట్లను.. ఇప్పుడు అన్ని ప్రాంతాలకు భక్తులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆధార్ కార్డు ఆధారంగా అన్ని ప్రాంతాల వారికి టొకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ బోర్డు తెలిపింది.
కాగా, కరోనా కారణంగా ఏడాదిన్నర కాలం నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ.. సెప్టెంబరు 8 నుంచి తిరిగి ప్రారంభించిన విషయం తెలిసిందే. కేవలం చిత్తూరు జిల్లాకు చెందిన ప్రజలకు మాత్రమే ప్రయోగాత్మకంగా సర్వదర్శనం టోకెన్లను జారీ చేయనున్నట్టు గతవారం టీటీడీ ప్రకటించింది. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయం వద్ద టోకెన్లు జారీచేస్తున్నారు. అయితే, కేవలం చిత్తూరు జిల్లాకు చెందిన వారికి మాత్రమే కేటాయిస్తారన్న విషయం తెలియక పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ.. ఇతర ప్రాంతాల వారికి సైతం సర్వదర్శనం టోకెట్లను జారీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇక సర్వదర్శనం టోకెట్లను జారీ చేయక ముందు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం, ప్రముఖుల సిఫార్సులు, వర్చువల్ సేవా టోకెన్ల ద్వారా రోజుకు 20 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే వెసులుబాటు కల్పించారు.
Also read:
Viral Video: గాఢ నిద్రలో పిల్ల ఏనుగు.. జడుసుకున్న తల్లి ఏనుగు.. ఆ తర్వాత ఏం చేసిందంటే..
KTR: కేటీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తిన బోర్గ్ బ్రాండె.. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి రమ్మని మళ్లీ ఆహ్వానం