Global Spirituality Mahotsav: కన్హా శాంతివనంలో ‘గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024’.. ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము

| Edited By: Shaik Madar Saheb

Mar 14, 2024 | 8:57 AM

Global Spirituality Mahotsav 2024 in Hyderabad: భారతదేశం అంటే సంస్కృతి, సాంప్రదాయం,ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక.. ప్రస్తుతం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో భారతదేశంలో స్పిరిచువల్ టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలలోని ఆధ్యాత్మిక గురువులను ఒకే వైదిక పైకి తీసుకురావడం కోసం భాగ్యనగరం లోనీ కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర సంస్కృతిక,పర్యటక శాఖ.

Global Spirituality Mahotsav: కన్హా శాంతివనంలో ‘గ్లోబల్ స్పిరిచ్యువాలిటీ మహోత్సవ్ 2024’.. ప్రారంభించనున్న రాష్ట్రపతి ముర్ము
Global Spirituality Mahotsav 2024 in Hyderabad
Follow us on

Global Spirituality Mahotsav 2024 in Hyderabad: భారతదేశం అంటే సంస్కృతి, సాంప్రదాయం,ఆధ్యాత్మిక శక్తికి ప్రతీక.. ప్రస్తుతం భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. దీంతో ఈ మధ్య కాలంలో భారతదేశంలో స్పిరిచువల్ టూరిజం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలలోని ఆధ్యాత్మిక గురువులను ఒకే వైదిక పైకి తీసుకురావడం కోసం భాగ్యనగరం లోనీ కన్హా శాంతివనంలో గ్లోబల్ స్పిరిచువాలిటీ మహోత్సవ్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కేంద్ర సంస్కృతిక,పర్యటక శాఖ. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు మఠాధిపతులు, పీఠాధపతులతో పాటు వివిధ దేశాల ఆధ్యాత్మిక గురువులు హాజరవుతున్నారు.

సంస్కృతి, ఆధ్యాత్మికత అనేవి భారతదేశ సాఫ్ట్ పవర్స్.. మన కల్చర్, స్పిరిచువల్ గైడెన్స్ తో యావత్ ప్రపంచమే ప్రభావితం అవుతుంది. మన ఆధ్యాత్మిక శక్తితో ఓ సానుకూల మార్గం వైపు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాం. అందులో స్వామి వివేకానంద మొదలుకుని.. అనేకమంది మహానుభావులు.. భారతదేశ గొప్పతనాన్ని, మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు. అందుకే యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు గౌరవ భావంతో చూస్తోంది. భారతదేశం హిందూ, బౌద్ధ, జైన, సిక్కు మతాలకు పుట్టినిల్లు. మనదేశంలో పుట్టిన అనేకమతాలు ప్రపంచమంతా విస్తరించాయి. శాంతిని బోధిస్తున్నాయి. ఆయా మతాల ఆచార వ్యవహారాలు, ఫిలాసఫీల కారణంగా.. భారతదేశం ఆధ్యాత్మిక భిన్నత్వం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. మన పురాణ, ఇతిహాసాలను, గీతాసారాన్ని, వేదాలు, ఉపనిషత్తుల్లో దాగి ఉన్న జ్ఞానాన్ని తెలుసుకునేందుకు ప్రపంచంలోని కోట్లాదిమంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ నేథ్యంలో భారతదేశంతోపాటుగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్పిరిచువల్ గురువులందరినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి.. మనశ్శాంతి నుంచి విశ్వశాంతి వైపు బాటలు వేయడం ద్వారా.. ప్రపంచవ్యాప్తంగా ఓ సానుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటుచేయాలనే లక్ష్యం తో ప్రపంచంలోని అన్ని మతాల సారాన్ని ఒకచోట చేర్చి విశ్వశాంతికోసం భారతదేశంలో ఒక మహత్తర కార్యక్రమం నిర్వహించాలని.. వివిధ మతాల ఆధ్యాత్మిక గురువులతో కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కాన్హా శాంతి వనంలో గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ నిర్వహిస్తుంది.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీ దాజీ అధ్వర్యంలో కన్హా ఈ మహత్తర కనర్యక్రమనికి వేదిక అయింది. ఈ మహత్కార కార్యక్రమంలో దాదాపు 300కు పైగా స్పిరిచువల్ లీడర్స్ తోపాటుగా.. దాదాపు లక్షమంది వరకు పాల్గొంటారని అంచనా. గతేడాది భారతదేశం ఆధ్వర్యంలో జరిగిన జీ20 సమావేశాలకోసం మనం ఎంచుకున్న థీమ్ వసుధైవ కుటుంబకం – వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ. ఇది జీ20లో పాల్గొన్న సభ్యదేశాలు, ప్రత్యేక ఆహ్వానిత దేశాలతోపాటు యావత్ ప్రపంచాన్ని ఆకర్షించింది. ఈ గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ లక్ష్యం కూడా ఇదే. ఐకమత్య భావన పెంపొందించడం, సకలజన సమ భావనను ప్రోత్సహించడం, ఇందుకోసం ఆధ్యాత్మిక భావనను ముందుకు తీసుకెళ్తూ.. వసుధైవ కుటుంబంకం ఆలోచన ప్రతి వ్యక్తి దగ్గరకు తీసుకెళ్లాలనేది ఈ సందేశం ప్రపంచానికి పంపాలనే లక్ష్యంతో మన దేశంలో తొలిసారి ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్న ఆధ్యాత్మిక గురువులు వారి మతాల సారాన్ని, అనుభవాలను, ఆధ్యాత్మిక, తాత్వికమైన ఆలోచనలను ఈ వేదిక ద్వారా పంచుకోనున్నారు.

వీరందరి మధ్య ఆరోగ్యకరమైన చర్చ, తాత్వికమైన చర్చ జరిగి.. విశ్వశాంతికోసం మార్గదర్శనం జరుగుతుందనే సంపూర్ణ విశ్వాసంతో ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కేంద్ర సంస్కృతి, పర్యాటక శాఖ. దీంతోపాటుగా.. రేపటి తరాలకోసం ఓ ఆరోగ్యకరమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు అవసరమైన పర్యావరణ పరిరక్షణ, యోగా, మెడిటేషన్ లను మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన సూచనలు కూడా ఈ వేదిక ద్వారా ప్రపంచానికి అందనున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చ్ 15 న గ్లోబల్ స్పిరిచువల్ మహోత్సవ్ ను ప్రారంభించనున్నారు.16 తేదీన ఉపరాష్ట్రపతి శ్జగదీప్ ధన్‌కర్ పాల్గొననున్నారు.

వీడియో చూడండి..


గురువారం (14న) సాయంత్రం ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్, మ్యూజిక్ కన్సర్ట్ తో పాటు, సంగీత కళాకారుల ప్రదర్శనలు, స్పిరిచువల్ గురువులతో కొన్ని సెషన్స్ ఉండనున్నాయి. రోజు నాలుగు సెషన్స్ స్పిరిచువల్ ప్లీనరీ సెషన్స్ ఉండనున్నాయి. ఈ సెక్షన్స్ లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి సందేశం ప్రత్యేక ఆకర్షణగా ఉండనుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..