హిందూ మతాన్ని అర్థం చేసుకోవాలంటే గీతను జీవితంలో ఒకసారైనా చదవాలి. గీతలో మానవ జీవితానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను చాలా సరళమైన భాషలో వివరించారు. అన్ని వేద గ్రంధాల సారాంశం గీత అని, పుట్టిన వార్షికోత్సవం జరుపుకునే ఏకైక గ్రంథం గీత అని చెప్పబడింది. మహా భారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు అర్జునుడి చెప్పిన జీవన సారాన్ని గీత సారంగా అభివర్ణించారు. శతాబ్దాలుగా గీత ప్రాముఖ్యత కొనసాగుతోంది. ఈ ఏడాది హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టిన రోజును డిసెంబర్ 23న జరుపుకోనున్నారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం మార్గశీర్ష మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నాడు జరుపుకునే భగవద్గీత పుట్టిన రోజు పండుగను ఈ సంవత్సరం 23 డిసెంబర్ 2023న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం మార్గశీర్ష మాసం లోని శుక్ల పక్ష ఏకాదశి 22 డిసెంబర్ 2023 ఉదయం 8:15 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి 23 డిసెంబర్ 2023 ఉదయం 7:10 వరకు కొనసాగుతుంది.
శ్రీ కృష్ణుడు అందించిన గీతా బోధనలు నేటి కాలంలో ప్రజలు తమ జీవితాల్లోని తీవ్ర నిరాశను దూరం చేసు కోవడానికి సహాయపడతాయి. హిందువులే కాకుండా ఇతర మతాలకు చెందిన వారు కూడా గీతను తమ జీవితాల్లో స్వీకరిస్తారు. అర్జునుడు యుద్ధంలో తన వారిని చూసి విధుల నుండి తప్పుకున్నప్పుడు.. కురుక్షేత్ర క్షేత్రంలో అర్జునుడికి శ్రీ కృష్ణుడు చేసిన ఉపదేశం శ్రీమద్ భగవద్గీత పేరుతో ప్రసిద్ధి చెందిందని హిందూ మతంలో పేర్కొన్నారు.
గీతా జయంతిని దేశవ్యాప్తంగా పండుగలా జరుపుకుంటారు. శ్రీ కృష్ణ భగవానుడు మార్గ శీర్ష శుక్ల ఏకాదశి తిథి రోజున గీతా బోధ చేశాడు. అదే రోజు భగవద్గీత పుట్టిన రోజుగా జరుపుకుంటారు. దేవాలయాలలో చాలా చోట్ల శ్రీమద్ భగవత్ గీత పఠిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో శ్రీకృష్ణుడు, గీత పూజలు చేస్తారు. భగవద్గీత పుట్టిన రోజు సందర్భంగా ప్రసంగాలు చదవడం, వినడం జరుగుతుంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం భగవద్గీత పుట్టిన రోజున ఆచారాల ప్రకారం గీత, విష్ణువును పూజిస్తారు. ఈ రోజున పూజలు చేయడం, దానధర్మాలు చేయడం వల్ల ప్రజలు తమ పాపాల నుండి విముక్తి పొంది జ్ఞానం, మోక్షాన్ని పొందుతారని చెబుతారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు