గరుడ పురాణం గురించి మీరు వినే ఉంటారు. ఈ పురాణం వ్యక్తులు చేసిన పాపపుణ్యాల ఆధారంగా మరణం తర్వాత పొందే ఆనందాలు, బాధలు గురించి ప్రస్తావిస్తుంది. ఈ పురాణంలోనే ప్రజలకు స్వర్గం, నరకం గురించి చెబుతారు. అలాగే ఓ వ్యక్తి ధర్మబద్దమైన జీవితాన్ని ఎలా గడపాలన్నది ఈ పురాణం చెబుతుంది. గరుడ పురాణాన్ని అర్ధం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది గానీ.. దాన్ని అర్ధం చేసుకున్నవారు మాత్రం ఖచ్చితంగా ధర్మబద్దంగా జీవించేందుకు ప్రయత్నం చేస్తారు.
ఇదిలా ఉంటే గరుడపురాణం ఒక వ్యక్తి తన కర్మను సరిదిద్దకునే మార్గం చూపిస్తుంది. ఈ పురాణంలో ఇటువంటి విధానాలు, జీవన నియమాలు స్పష్టం చేశారు. దీనిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన కష్టాలన్నిటినీ అధిగమించగలడు. ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని చదివి దాని నుండి నేర్చుకొని వారి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైన సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అలవాట్లను వదులుకుంటే మీ జీవితం సంతోషంగా ఉంటుందని గరుడ పురాణం పేర్కొంటోంది.
1. ఆరోగ్యకరమైన ఆహారాల్లో పెరుగు కూడా ఒకటి. అయితే పెరుగును రాత్రిపూట తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. రాత్రిపూట పెరుగు తినడం వల్ల ఎక్కువగా కడుపు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.
2. మీరు నాన్-వెజ్ ప్రియులు అయితే, నిల్వ ఉంచిన మాంసాన్ని తింటున్నట్లయితే.. అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. ఫ్రిజ్‌లో రెండు లేదా మూడు రోజులపైన నిల్వ ఉంచిన మంసంపై ప్రమాదకరమైన బ్యాక్టిరీయా వృద్ది చెందుతుంది. ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరుకుని వ్యాధుల బారిన పడేలా చేస్తుంది.
3. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉంటుందని గరుడ పురాణం పేర్కొంటోంది. ఆ గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. దాన్ని పీల్చడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు తగ్గి.. వయస్సు పెరుగుతుందని చెబుతోంది. ఈ నేపధ్యంలో ఎవరైతే ఉదయాన్ని ఆలస్యంగా లేస్తారో.. వారి ఆయుష్షు తగ్గుతుందని గరుడ పురాణంలో ఉంది. వారిని అనేక వ్యాధులు చుట్టుముడతాయని తెలిపింది.
4. శ్మశానవాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత వచ్చే పొగలో అనేక రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. దహన సంస్కారాలకు వచ్చిన వారిపై అవి గాలి ద్వారా ఈజీగా చేరుతాయి. అందుకే దహన సంస్కారాలకు వెళ్లి ఇంటికొచ్చిన తర్వాత.. స్నానం చేసి బట్టలు మార్చుకోవాలని పెద్దలు సూచిస్తారు.
5. గరుడ పురాణం ప్రకారం, సూర్యోదయం తర్వాత శృంగారంలో పాల్గొంటే పురుషుల ఆయుష్షు తగ్గుతుంది. అంతేకాకుండా మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. ప్రతీ రోజూ యోగా, ప్రాణాయామం, ధ్యానం చేయడం ద్వారా మీ శక్తిని పెంపొందించుకోవచ్చు.
Also Read:
ఉదయాన్నే టిఫిన్‌లో ఈ 5 ఆహార పదార్ధాలు అస్సలు తినొద్దు.. తస్మాత్ జాగ్రత్త.! అవేంటంటే..
ఈ నాలుగు రాశులవారు ప్రేమించినవారిని కష్ట సమయాల్లో ఒంటరిగా వదిలిపెట్టరు.. అందులో మీరున్నారా?