సనాతన హిందూధర్మంలో 18 పురాణాలు, 4 వేదాలు ఉన్నాయి. 18 పురాణాలలో గరుడ పురాణం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గరుడ పురాణానికి ప్రత్యేక హోదా ఇవ్వడంతో దీనిని మహాపురాణం అంటారు. గరుడ పురాణానికి అధిపతి శ్రీ హరి విష్ణు. హిందూ మతంలో ఎవరైనా చనిపోయినప్పుడు.. అక్కడ గరుడ పురాణాన్ని పఠించడం ద్వారా ఆ వ్యక్తి ఆత్మ మోక్షాన్ని పొందుతుందని విశ్వాసం. గరుడ పురాణం అనేక వ్యక్తులకు చెందిన కర్మను వాటి ఫలితాలను గురించి విశదీకరిస్తుంది. ఎవరైనా సరే ఎటువంటి సందర్భం ఎదురైనా మంచి పనులు చేయలని ప్రేరేపిస్తుంది. ఇలాంటి గరుడ పురాణంలో కొన్ని మంత్రాలను ప్రస్తావించారు. వీటిని జపించడం వలన వ్యాధుల నుంచి ఉపశమనం, ఆర్థిక లాభాన్ని పొందవచ్చు. ఈ రోజు ఆ మహా మహిమానిత్వ మంత్రాలు ఏమిటో తెలుసుకుందాం..
ఓం జుమ్ స: (ॐ जूं स:)
ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పేదరికం నుంచి తక్కువ సమయంలో బయటపడవచ్చు అని.. త్వరలోనే ఆర్దిక ఇబ్బందులు తీరి ధనవంతుడు అవుతాడని నమ్ముతారు. అంతేకాదు గరుడ పురాణంలో శ్రీ విష్ణు సహస్త్రానామ మహిమ ప్రస్తావన కూడా ఉంది. ఆరు నెలల పాటు విష్ణు సహస్ర నామ పఠనం చేస్తే జీవితంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకి తొలగిపోతుందని నమ్మకం.
యక్షి ఓం ఓం స్వాహా (यक्षि ओम उं स्वाहा )
సంజీవని మంత్రం గరుడ పురాణంలో కూడా ప్రస్తావించబడింది. గరుడ పురాణం ప్రకారం ఈ మంత్రాన్ని జపించే వ్యక్తి ఇతరుల జీవితాల్లో కూడా ఆనందాన్ని తీసుకురాగలడు. అయితే మాత్రలను జపించే ముందు పూర్తి నియమాలను తెలుసుకున్న తర్వాత.. నిరూపితమైన వ్యక్తి నుంచి నేర్చుకుని సంజీవని మంత్రాన్ని ఉపయోగించాలి. అంతేకాదు మంత్రాలను ఎల్లప్పుడూ లోక కల్యాణానికి ఉపయోగించాలి.
18 మహాపురాణాలలో గరుడ పురాణం ఒకటి. గరుడ పురాణంలో 19 వేల శ్లోకాలు ఉన్నాయి. వీటిల్లో ఏడు వేల శ్లోకాలు జీవితానికి సంబంధించిన లోతైన విషయాలను వివరిస్తాయి. ఇది జ్ఞానం, మతం, విధానం, రహస్యం, ఆత్మ, స్వర్గం, నరకం వంటి వివరణను కలిగి ఉంది. గరుడ పురాణం చదవడం లేదా వినడం ద్వారా ఎవరైనా సరే జ్ఞానోదయం, పుణ్యం, భక్తి, జ్ఞానం, యాగం, తపస్సు, తీర్థయాత్ర మొదలైన వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటాడు. కనుక ప్రతి ఒక్కరూ వీలైనప్పుడు గరుడ పురాణం గురించి తెలుసుకోవాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు