Ganesh Chaturthi: ముంబైలో అందంగా ముస్తాబైన గణేష్ మండపాలు.. అక్కడ గణపతిని దర్శించుకోవాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే.. మోడ్రన్ దుస్తులకు నో ఎంట్రీ బోర్డు..

|

Sep 19, 2023 | 9:36 AM

అనేక పండల్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ పండల్ నిర్వాహకులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పొట్టి పాశ్చాత్య దుస్తులు ధరించిన భక్తుల పండాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఈ మేరకు నిర్వాహకులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వాహకులు దర్శనం కోసం వచ్చే సందర్శకులు ఈ నిబంధనలు పాటించాలని సూచించారు.

Ganesh Chaturthi: ముంబైలో అందంగా ముస్తాబైన గణేష్ మండపాలు.. అక్కడ గణపతిని దర్శించుకోవాలంటే డ్రెస్ కోడ్ పాటించాల్సిందే.. మోడ్రన్ దుస్తులకు నో ఎంట్రీ బోర్డు..
Ganesh Chaturthi Celebrations
Follow us on

దేశ వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ మండపాలు ఏర్పాటు చేసి గణపతి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజలను చేస్తున్నారు. అయితే దేశంలో వినాయక చవితి వేడుకలు అంటే వెంటనే గుర్తుకొచ్చే ముంబై లో కూడా మండపాలను జోరుగా ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఓ పండల్  నిర్వహకులు భక్తుల దర్శన విషయంలో పెట్టిన నిబంధనతో వార్తలలో నిలిచారు. ముంబయిలోని అంధేరీ ప్రాంతంలోని గణేష్ చతుర్థి వేడుకలను నిర్వాహకులు ఘనంగా ఏర్పాటు చేశారు. అనేక పండల్స్ దర్శనమిస్తున్నాయి. తాజాగా ఓ పండల్ నిర్వాహకులు సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. పొట్టి పాశ్చాత్య దుస్తులు ధరించిన భక్తుల పండాల్లోకి ప్రవేశించడాన్ని నిషేధించారు. ఈ మేరకు నిర్వాహకులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. నిర్వాహకులు దర్శనం కోసం వచ్చే సందర్శకులు ఈ నిబంధనలు పాటించాలని సూచించారు. అంతేకాదు మండప సమీపంలో పురుషులు, మహిళలు ఇద్దరికీ ధోతీలు, ట్రాక్ ప్యాంటు, గాగ్రా లను ఏర్పాటు చేశారు. వినాయకుని దర్శనం కోరుకునే వారి దర్శన ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

మహారాష్ట్ర గణేశోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకుంటుంది. ముంబయిలో నేడు వినాయక చవితి జరుపుకోనున్నారు. నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకల కోసం వినాయక  విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు అన్ని గణేశుడి మండపాలు రెడీ అయ్యాయి.

అంధేరిలో గణేశుడి దర్శనానికి కొన్ని నియమాలు

అంధేరిలో ‘అంధేరీ కా రాజా’ 58వ సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి రెడీ అవుతుంది. ఈ ఉత్సవాల కోసం కొన్ని నియమాలు పేర్కొనబడ్డాయి. సందర్శకులు పండల్‌లోకి ప్రవేశించేటప్పుడు షార్ట్‌లు, స్కర్టులు వంటి మోడ్రెన్ దుస్తులను ధరించకూడదని నియమాలు నిర్దేశిస్తాయి. ముంబైలోని ప్రసిద్ధ ‘అంధేరీ కా రాజా’ పండల్ లో జీన్స్‌తో ప్రవేశానికి అనుమతిస్తామని, షార్ట్ లేదా స్కర్టులు ధరించిన వారిని దర్శనానికి అనుమతి ఇవ్వమని పేర్కొన్నారు. ఈ విషయాన్నీ తెలియజేస్తూ ఓ బోర్డు కూడా ఏర్పాటు చేశారు.

దర్శన ఏర్పాట్లు

దర్శనం కోసం ఏర్పాటు చేసిన నియమం పురుషులు, మహిళలు ఇద్దరికీ వర్తిస్తుంది. సందర్శకులు పొట్టి దుస్తులు ధరించి వస్తేవారిని మండపంలోని గణేశుడి దర్శనానికి అనుమతినివ్వమని పేర్కొన్నారు. 13 ఏళ్లు పైబడిన వారికి డ్రెస్ కోడ్ వర్తిస్తుంది. సందర్శకులను ఈ విషయంలో ముందుగానే హెచ్చరించాలని భావించిన నిర్వాహకులు ఇప్పటికే పండల్‌లో బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం భారీ సంఖ్యలో ప్రముఖులు పండల్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ వినాయకుడిని ‘అంధేరి కా రాజా’ని ‘కోరికల రాజు’ అని కూడా పిలుస్తారు.

పండల్..  భక్తుల భీమా

‘అంధేరీ కా రాజా’ పండల్ వద్ద అలంకరణ చాలా అందంగా ఉంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక  ప్రతిరూపాన్ని కూడా రూపొందించారు. నిర్వాహకులు గణేష్ పండల్‌కు 8 కోట్ల రూపాయలకు పైగా బీమా చేశారు. భక్తులకు రూ.50 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పించారు. పండల్ వద్ద గణపతిని ఏర్పాటు చేయడానికి  రాయగడ్ కోట ప్రతిరూపాన్ని రూపొందించారు. పండల్‌లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ నవరాత్రుల్లో ప్రతి క్షణాన్ని పర్యవేక్షించనున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..